రెమిడెసీవర్ ఇంజెక్షన్ లను పక్కదారి పట్టిస్తున్న మరో ముఠాను అరెస్ట్ చేసారు ఏపీ పోలీసులు. ఆశ్రం కొవిడ్ కేర్ హాస్పిటల్ నుండి రెమిడెసివర్ ఇంజక్షన్ లను పక్కదారి పట్టిస్తున్నారు పదిమంది ముఠా సభ్యులు. ఆ ముఠా దగ్గర నుండి 40 రెమిడెసివర్ ఇంజెక్షన్లు, 1లక్ష 45 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల వ్యవదిలో రెమిడెసివర్ ఇంజక్షన్ లను పక్కదారి పట్టించి అమ్ముకుంటున్న మూడు ముఠా లను అరెస్ట్ చేసారు. అయితే పోలీసులు కొరడా దుళిపిస్తున్న రెమిడెసివర్ ల దందా ఆగడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రి, ఆశ్రం ఆసుపత్రి ల కేంద్రంగా దందా కొనసాగుతున్నట్లు సమాచారం.