వివిధ కేసుల్లో సుమారు 40 కి పైగా నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ కాగా వాటినుండి తప్పించుకొనుటకు 15 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న, ఒక ఘరానా మోసగాడిని వెంటాడి , వేటాడి కటకటాల పాలు చేసిన కరీంనగర్ పోలీసులు !! ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన విలన్, ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడిన తర్వాత, ఆ జీవితంతో తృప్తి పడక, అధికంగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు కావాలనే దురాశతో, […]
మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. అందులో తెలంగాణ కూడా ఉంది. అయితే ఈ లాక్ డౌన్ లో భారత సైనికులకు కష్టాలు ఎదురయ్యాయి. తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడ్డారు సైనికులు. అయితే ముంబయి నుండి హైదరాబాద్ మీదుగా బెంగుళూరు వెళుతున్న భారత సైనికులకు లాక్ డౌన్ కారణంగా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలలో మూత పడ్డ హోటళ్ళు ఎదురయ్యాయి. అయితే సైనికులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారనే […]
ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలకు యాస్ తుఫాన్ అతి తీవ్ర ముప్పు ఉన్నట్లు తెలుస్తుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మారిన యాస్… వచ్చే 12గంటల్లో మరింత బలపడి విరుచుకుపడే అవకాశం ఉంది. పారాదీప్ కు దక్షిణ-ఆగ్నేయంలో 320 కి.మీ.., బాలాసోర్ కి ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యి చాంద్ బలి దగ్గర రేపు అతితీవ్ర తుఫాన్ తీరం దాటే చాన్స్ ఉన్నట్లు సమాచారం. ఐఎండీ ఆరెంజ్ బులెటిన్ విడుదల చేయగా… యాస్ […]
రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో కొంతమంది యువకులు రెచ్చిపోయారు. విధులు నిర్వహిస్తున్న పోలీసుల పై దాడికి యత్నించారు పోకిరీలు. లాక్ డౌన్ టైమ్ అయిపోయినప్పటికి మాస్క్ లేకుండా హెల్మెట్ ధరించకుండా మోటర్ సైకిల్ పై వెళుతున్న యువకుడిని అడ్డగించిన పోలీసులు… ఎక్కడికి వెళుతున్నావని యువకుడిని ప్రశ్నించారు పోలీసులు. మా వాడి బండే ఆపుతావా అంటూ రోడ్డు పై వున్న బండరాయి తీసి కానిస్టేబుల్ పై దాడికి యత్నం చేశాడు. బండి తీసుకోవడానికి వెళ్లానని చెబితే వినరా అంటూ […]
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టే మనసు తెలుగువారి సొంతం. భాషాభేదాలు లేకుండా టాలెంట్ ను గుర్తించడంలో ముందుంటారు మన తెలుగువారు. అందువల్లే ఎంతోమంది పరభాషా తారలు మన చిత్రసీమలో జేజేలు అందుకుంటున్నారు. ఇతర భాషలకు చెందిన వారి దృష్టి సైతం తెలుగు సినిమావైపే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళనటుడు శివకుమార్ తనయులు సూర్య, కార్తీ ఇద్దరూ తెలుగునాట కూడా రాణిస్తున్నారు. సూర్య ముందుగానే వచ్చి, తెలుగువారిని అలరించినా, ఆయన తమ్ముడు కార్తీ మాత్రం తెలుగు […]
ఆనందయ్య మందు పంపిణీ ఎవరు అడ్డుకున్నా దుర్మార్గం. ఆనందయ్య తో బలవంతంగా మందు తయారు చేయించి వైసీపీ ఎమ్మెల్యేలు వారికి కావాల్సిన తెలంగాణ వ్యాపారస్తులకు పంచుకుంటున్నారు అని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కృష్ణపట్నం వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆనందయ్య ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు…ఆయన్ని ప్రజలు కాపాడుకుంటారు. సెకండ్ ఫేజ్ లో ప్రజలు చనిపోతుంటే….ఆనందయ్య మందుకి కోవిడ్ థర్డ్ ఫేజ్ లో అనుమతి ఇస్తారా… […]
తండ్రి అడుగుజాడల్లో తనయులు పయనించడం చిత్రసీమలో పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా నటుల వారసులు నటనవైపే మొగ్గు చూపుతున్నారు. ఆ మాటకొస్తే నిర్మాతలు, దర్శకులు, సాంకేతికనిపుణుల వారసులు కూడా నటనపైనే మోజు పెంచుకుంటున్నారు. ఇక నటవిరాట్ గా జనం మదిలో నిలచిన రావు గోపాలరావు తనయుడు రావు రమేశ్ సైతం నాన్న బాటలో పయనించి, జేజేలు అందుకుంటున్నాడు. వాచకాభినయంలో భళా అనిపించిన రావు గోపాలరావు తనయునిగా రావు రమేశ్ కూడా తనదైన డైలాగ్ యాక్సెంట్ తో జనాన్ని ఇట్టే […]
సంగారెడ్డి జిల్లాలో కఠినంగా లాక్ డౌన్ అమలు పరిచే విధంగా జిల్లాకు రావడం జరిగింది అని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఈ పాస్ లు, ఇతర రాష్ట్రాల ఈ పాస్ లు ఉన్న రాష్ట్ర సరిహద్దులోకి అనుమతి ఇస్తున్నాము. ఎలాంటి పని లేకుండా రోడ్లపై కి వస్తే కేసు నమోదు చేస్తాం, మళ్ళీ అదే విధంగా లాక్ డౌన్ నిభందనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేస్ లు నమోదు చేస్తాం […]
మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ను అడ్డుకోవడానికి ఈ ఏడాది ఆరంభం నుండి మన దేశ కరోనా వ్యాక్సిన్ ను దశల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 1 నుండి 18 ఏళ్ళు దాటినా వారికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ ఇన్ని రోజుకు వారు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగానే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ […]
తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులను కట్టడి చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. కేసుల నమోదును తక్కువగా చూపుతున్నారని పేర్కొన్న పిటిషనర్.. తక్కువ కేసులు చూపడంతో కేంద్రం నుండి మందులు తక్కువగా సరఫరా అవుతున్నాయి అని అన్నారు. బ్లాక్ ఫంగస్ డ్రగ్స్ దిగుమతికి కేంద్రాన్ని ఆదేశించాలి. బ్లాక్ ఫంగస్‌తో ప్రాణాలు పోతున్నాయి.. కేసుల నమోదు లెక్కలు రాష్ట్రం ప్రకటించాలి అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఉత్వర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. అయితే […]