మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. అందులో తెలంగాణ కూడా ఉంది. అయితే ఈ లాక్ డౌన్ లో భారత సైనికులకు కష్టాలు ఎదురయ్యాయి. తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడ్డారు సైనికులు. అయితే ముంబయి నుండి హైదరాబాద్ మీదుగా బెంగుళూరు వెళుతున్న భారత సైనికులకు లాక్ డౌన్ కారణంగా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలలో మూత పడ్డ హోటళ్ళు ఎదురయ్యాయి. అయితే సైనికులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకొని 200 మందికి ఆహారం అందించారు వీబీజి సంస్థ సభ్యులు రాజు. ఇక లాక్ డౌన్ లో తమ సైన్యానికి భోజనం సమకూర్చిన రాజుకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్మీ అధికారి శ్రీనివాస్.