కోవిడ్ నిబంధనలు పాటించడం లో మనుషులకు ఆదర్శంగా నిస్తున్నాయి కోతులు. భౌతిక దూరం పాటిస్తూ ఆహారం తీసుకుంటున్న ఘటన పుత్తూరు మండలం కైలాసకోన పర్యాటక కేంద్రం వద్ద చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా పర్యాటక కేంద్రం మూతపడడంతో కోతులకు ఆహరం అందడం లేదు. దాంతో కోతులకు ఆహారం పెట్టడానికి సిద్ధపడింది కైలాసనాధ ఆలయ కమిటీ. కోతులు భౌతిక దూరం పాటించేలా రోడ్డుపై మార్కింగ్ చేసారు కమిటీ సభ్యులు. అయితే క్రమం తప్పకుండా ఆ మార్కింగ్ లో […]
యాస్ తుపాన్ ప్రభావిత జిల్లాల జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసారు మంత్రి ఆళ్ల నాని. తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి ఆళ్ల నాని… విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాల DMHO లు DCHS, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ముందుగా సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి […]
కేంద్రం పంజరంలో చిలుకగా పేరు మోసిన సిబిఐ డైరెక్టర్ ఎంపిక భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ జోక్యంతో కొత్త మలుపు తిరగడం కీలక పరిణామం. సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు,సిజెఐ సభ్యులుగా వుంటారు. కేంద్ర క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది గనక ఈ కమిటీ చర్చలు లాంఛనంగానే పరిగణించబడేవి. ఈసారి బిఎస్‌ఎప్ డైరెక్టర్‌గా వున్న రాకేశ్ ఆస్తానా, ఎన్‌ఐఎ బాస్ వైసిమోడీ పేర్లు తుది జాబితా నుంచి ఎగిరిపోయాయి. రాకేశ్ ఆస్తానాను ప్రధాని […]
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,821 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,60,141 కి చేరింది. ఇందులో 5,18,266 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,706 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 23 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో […]
ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే.. కానీ ఇప్పటి వరకు ఈటల నన్ను కలవలేదు అని తెలిపారు. ఆయన నేను కలిసి 15 ఏళ్ళు కలిసి పనిచేసాం… ఇప్పుడు కలిస్తే తప్పేంటి అని అన్నారు. మేము కలిసినంత మాత్రానా పార్టీ లో చేరేందుకు అనుకోలేము. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. అందరినీ కలుస్తున్నా మిమ్మల్ని కూడా కలుస్తా అని నాతో చెప్పాడు […]
విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు హోంమంత్రి సుచరిత. ప్రమాద సంఘటన గురించి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన హోం మినిస్టర్… సహాయకచర్యలు చేపట్టాలని ఫైర్ పోలీసు అధికారులను ఆదేశించారు. హెచ్‌పీసీఎల్ లోని ఫైర్ ఐదు ఇంజెన్స్ తో పాటు మరో 7 అదనంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. హెచ్‌పీసీఎల్ లో పాత టెర్మినల్ లో ప్రమాదం జరిగినట్లు హోంమంత్రి కి వివరించారు అధికారులు. ప్రమాదం సంభవించిన వెంటనే సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించినట్లు తెలిపారు. […]
హైదరాబాద్ లో గచ్చిబౌలి లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ ని సందర్శించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జులై 23 – 2021 నుండి ఆగస్టు 8 – 2021 వరకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలంపిక్స్ కు సన్నద్ధమవుతున్నా బ్యాడ్మింటన్ క్రీడాకారులను కోచ్ గోపిచంద్తో కలసి మంత్రి ప్రోత్సహించారు. లాక్ డౌన్ సమయంలో క్రీడాకారులు బయటికి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మంత్రి. కోవిడ్ నిర్ములన లో భాగంగా క్రీడాకారులు తమ ఫిట్ నెస్ ను […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 15,284 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,09,105 కు చేరింది. ఇందులో 14,00,754 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,98,023 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 106 […]
ఆనందయ్య మందు పై పరిశోధన వేగవంతం చేసారు తిరుపతి ఆయుర్వేద వైద్యులు. 18 మంది వైద్యులు, 32 మంది పిజి విధ్యార్దులుతో పరిశోధన జరుపుతున్నాం అని ఆయుర్వేద ప్రిన్సిపాల్ మురళిక్రిష్ణా తెలిపారు. సిసిఆర్ఏఏస్ ఆదేశాలు మేరకు మందు వేసుకున్న 500 మంది వివరాలు సేకరిస్తూన్నాం. విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధన జరుగుతుంది. ఏక్కువ మంది ముందస్తూగా మందును వేసుకున్నారు. అదనంగా మరో 200 మంది వివరాలను అందించాలని జిల్లా యంత్రాగాని కోరాం. ఇవాళ రాత్రికి సిసిఆర్ఏఏస్ కి […]
జునిపెర్ నెట్‌వర్క్స్ క్లౌడ్ & ఆటోమేషన్ అకాడమీ (జెఎన్‌సిఎఎ) మరియు స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విఐటి-ఎపి విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఒయు) సంతకం కార్యక్రమం మే 25, 2021 మంగళవారం నాడు వర్చ్యువల్ విధానంలో జరిగింది. జెఎన్‌సిఎఎతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత విఐటి-ఎపి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డా|| ఎస్ వి కోటా రెడ్డి మాట్లాడుతూ ఈ సహకారం అధ్యాపకులకు మరియు విద్యార్థులకు జునిపెర్ ట్రైనింగ్ & సర్టిఫికేషన్ పొందడానికి సహాయపడుతుందని […]