తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులను కట్టడి చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. కేసుల నమోదును తక్కువగా చూపుతున్నారని పేర్కొన్న పిటిషనర్.. తక్కువ కేసులు చూపడంతో కేంద్రం నుండి మందులు తక్కువగా సరఫరా అవుతున్నాయి అని అన్నారు. బ్లాక్ ఫంగస్ డ్రగ్స్ దిగుమతికి కేంద్రాన్ని ఆదేశించాలి. బ్లాక్ ఫంగస్‌తో ప్రాణాలు పోతున్నాయి.. కేసుల నమోదు లెక్కలు రాష్ట్రం ప్రకటించాలి అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఉత్వర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.