శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించాం అని శ్రీకాకుళం.జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. రిమ్స్ లో స్పెషల్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి మాత్రమే యాంపోటెరిసిన్ వాడుతున్నాం. బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కు కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉంది అన్నారు. అవసరం మేరకు ప్రభుత్వం నుంచి మందులు సప్లై ఉన్నాయి. ఆపరేషన్ అవసరమైతే చికిత్స చేయించేందుకు నిపుణులతో మాట్లాడుతున్నాం. అందుకు కావాల్సిన ఏర్పాట్లు రిమ్స్ , జెమ్స్ లో […]
రాష్ట్రంలో 7 వేల పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. నిన్న సాయంత్రం వరకే 77 శాతం ధాన్యం కొనుగోలు చేశాం అని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 90 లక్షల మంది రైతుల వద్ద…11వేల 500 కోట్ల విలువైన 61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేశాం. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేటలో ధాన్యం లేక కొనుగోలు కేంద్రాలు మూసివేశాము అన్నారు. ఒకటి రెండు […]
డాక్టర్ల సమ్మె పై మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రెసిడెంట్, జూనియర్ డాక్టర్లను ఈటల విజ్ఞప్తి చేసారు. ”మొన్నటి వరకు మీ కుటుంబ సభ్యునిగా ఉన్న నేను ప్రజల తరపున మీకో విజ్ఞప్తి. కరోనా కష్ట కాలంలో మీరు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రాణాలకు సైతం తెగించి చికిత్స అందించి ప్రజల ప్రాణాలు కాపాడారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు ఇలాంటి సమయంలో మీరు సమ్మె కు దిగితే పేద […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ బీసీ కమిషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడుతూ… ఆత్మ గౌరవం వ్యాపారాలు పెంచుకోవడమేనా అని ఈటలను ప్రశ్నించారు. మీ వెంట ఎవరూ లేరు ఓడిపోతారని భయంతో రాజీనామా చేయడం లేదు. అధినేత కేసీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు మానుకోండి ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. తెరాస తరఫున గెలిచి స్థానిక సంస్థల ప్రతినిధులు తెరాసలో కొనసాగడం అమ్ముడుపోవడం ఎలా అవుతుంది. పార్టీలో ఉండి అధినేతపై పార్టీ పై […]
పోలీసులు ప్రాణాలను అడ్డంపెట్టి లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్నారు.ప్రజల ప్రాణాల రక్షణ కోసం మేము నిరంతరం పని చేస్తున్నాం. మీరు క్షేమంగా ఇళ్లల్లో ఉండండి మేము రోడ్లమీద మీ కోసం పని చేస్తున్నాం అని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ ను ప్రజలు సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. అనవసరంగా ఎవరు ప్రజలు రోడ్ల మీదికి రావద్దు. వాహనాలు సీజ్ చేసినట్లయితే లాక్ డౌన్ పూర్తయిన తర్వాతనే అప్పగిస్తాం. 99% లాక్ డౌన్ సమర్థవంతంగా విజయవంతమైంది […]
రాష్ట్రంలో నిత్యావసరాలు బ్లాక్ చేయకుండా ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలి. డిసెంబర్ నాటికి అందరికి వాక్సిన్ ఇస్తాం అని తెలిపారు. లాక్ డౌన్లో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలతో కలసి సహాయము చేయాలి. కరోనాతో చనిపోయిన,సహజ మరణం, ప్రమాదంలో మరణించిన వారందరికి పీఎం భీమా యోజన అందుతుంది. కరోనాతో చనిపోతున్న […]
ఒరిస్సా, బెంగాల్ తీరంపై విరుచుకుపడుతుంది అతి తీవ్ర తుఫాన్ ‘యాస్’. ధమ్ర పోర్ట్ కు సమీపంలో తీరాన్ని తాకిన అతి తీవ్ర తుఫాన్… మధ్యాహ్నం తర్వాత బాలాసోర్-ధమ్ర పోర్ట్ మధ్య తీరం దాటనుంది అతితీవ్ర తుఫాన్. 9 ఒడిషాజిల్లాలపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే అక్కడ రెడ్ వార్నింగ్ జారీ చేసింది ఐఎండీ. ఈ తుఫాన్ కారణంగా బెంగాల్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ధమ్ర పోర్ట్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక […]
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్య పద్ధతిలో ఆమోదించుకున్న “మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు” రద్దు చేయాలని, కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై నేటికి ఆరు నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల పట్ల మోడీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ, “సంయుక్త కిసాన్ మోర్చా” మే 26 వ తేదీన “బ్లాక్ డే” నిర్వహించాలని పిలుపునిచ్చారు. […]
వనస్థలిపురం అగ్ని ప్రమాదం కేస్ లో మలుపు చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంలో నిజం లేదని తేల్చింది ఫైర్ సిబ్బంది. ప్రభుత్వ ఉద్యోగి సరస్వతి బలవన్మరణానికి పాల్పడ్డింది. భార్య భర్త మధ్య గొడవ కారణంగా తనంతట తానే ఒంటికి నిప్పు అంటించుకుంది భార్య. ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేసి గాయాల పాలయ్యాడు భర్త బాలకృష్ణ. అయితే ఒక్కసారిగా మంటలు రావడం చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ […]
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 2,08,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,71,57,795 కి చేరింది. ఇందులో 2,43,50,816 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 24,95,591 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,157 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,11,388 కి చేరింది. ఇక ఇదిలా […]