తండ్రి అడుగు జాడల్లో… రావు రమేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి అడుగుజాడల్లో తనయులు పయనించడం చిత్రసీమలో పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా నటుల వారసులు నటనవైపే మొగ్గు చూపుతున్నారు. ఆ మాటకొస్తే నిర్మాతలు, దర్శకులు, సాంకేతికనిపుణుల వారసులు కూడా నటనపైనే మోజు పెంచుకుంటున్నారు. ఇక నటవిరాట్ గా జనం మదిలో నిలచిన రావు గోపాలరావు తనయుడు రావు రమేశ్ సైతం నాన్న బాటలో పయనించి, జేజేలు అందుకుంటున్నాడు. వాచకాభినయంలో భళా అనిపించిన రావు గోపాలరావు తనయునిగా రావు రమేశ్ కూడా తనదైన డైలాగ్ యాక్సెంట్ తో జనాన్ని ఇట్టే పట్టేశాడు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో బిజీయెస్ట్ కేరెక్టర్ యాక్టర్ ఎవరంటే రావు రమేశ్ పేరే వినిపిస్తోంది.
రావు రమేశ్ చెన్నైలోనే విద్యనభ్యసించాడు. రమేశ్ కు ఫోటోగ్రఫి అంటే ప్రాణం. అందువల్ల స్టిల్ ఫోటోగ్రఫిలో పనిచేశాడు. తరువాత కె.రాఘవేంద్రరావు తమ్ముడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.ఎస్. ప్రకాశ్ వద్ద కూడా అసిస్టెంట్ గా ఉన్నాడు. బెంగళూరులో ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలోనూ శిక్షణ పొందాడు. అందులో ఎందుకనో అంతగా రాణించలేక పోయాడు. దాంతో నటనలో ప్రయత్నం మొదలెట్టాడు. “పవిత్రబంధం, కలవారి కోడలు” సీరియల్స్ లో నటించాడు రావు రమేశ్. నాలుగున్నర ఏళ్ళలో దాదాపు వెయ్యి ఎపిసోడ్స్ లో నటించిన రావు రమేశ్ కు జనాల్లోనూ మంచి గుర్తింపు లభించింది. బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘సీమసింహం’లో సిమ్రాన్ సోదరునిగా నటించి, వెండితెరపై కనిపించాడు. తరువాత మళ్ళీ సీరియల్స్ లో నటిస్తూనే, సినిమాల్లో అవకాశం వస్తే చాలు నటించేసేవాడు. ‘గమ్యం’లో వామపక్షవాదిగా, ‘కొత్తబంగారులోకం’లో లెక్చరర్ గా, ‘మగధీర’లో అఘోరాగా, ‘లీడర్’లో హీరో మావయ్యగా… ఇలా పలు చిత్రాల్లో గుర్తింపు ఉన్న పాత్రలు పోషించాడు రావు రమేశ్. అతని నటన జనాన్ని ఆకట్టుకుంటున్న సమయంలో అందరిలోనూ ‘ఎవరీ రావు రమేశ్’ అన్న ప్రశ్న మొదలయింది. అప్పటి దాకా తాను ‘రావు గోపాలరావు తనయుణ్ణని’ చెప్పుకోకుండానే సాగాడు రమేశ్. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తరువాతే గర్వంగా తాను రావు గోపాలరావు తనయుణ్ణి అని చెప్పుకున్నారు. అదీ రావు రమేశ్ లోని నిబద్ధత!
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
తండ్రి అంత మేనిఛాయ లేకపోయినా, రావు రమేశ్ ను చూడగానే రావు గోపాలరావు పోలికలు కనిపిస్తాయి. ఇక కొన్ని చిత్రాలలో అయితే, గతంలో రావు గోపాలరావు పోషించిన పాత్రల గెటప్స్ నే రావు రమేశ్ తోనూ పోషింపచేశారు. ఆ యా పాత్రల్లో రావు రమేశ్ మంచి మార్కులే సంపాదించాడు. ఇప్పటి దాకా తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేస్తూ సాగుతున్నాడు రావు రమేశ్. ఆయన నటించిన “సీటీమార్, నారప్ప, పుష్ప, ఖిలాడీ, మహాసముద్రం” చిత్రాలు జనం ముందుకు రానున్నాయి. మరి ఈ చిత్రాలలో రావు రమేశ్ ఏ తీరున తన విలక్షణమైన అభినయంతో అలరిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!