సీఎం కాన్వాయ్ కు అడ్డు వచ్చిన కేస్ లో ఇద్దరు మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్ ఇస్తున్నారు. శనివారం సచివాలయం నిర్మాణ పనులు చూసేందుకు వెళ్లారు సీఎం కేసీఆర్. పోలీసుల బందోబస్తు దాటుకుని కాన్వాయ్ ఫాలో అయ్యి అడ్డు వచ్చారు ఇద్దరు యువకులు. ఓవర్ స్పీడ్ తో బైక్ నడిపిన యువకులను చూసి కాన్వాయ్ ఆగింది. ఆ ఇద్దరు యువకుల పై కేస్ నమోదు చేసిన పోలీసులు ఆ బైక్ కూడా దొంగలించిన వాహనం గా గుర్తించారు. వారం […]
హిందీ చిత్రసీమలో మేటి నటులుగా పేరొందిన దిలీప్ కుమార్, రాజ్ కుమార్ కలసి నటించిన ‘సౌదాగర్’ చిత్రం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రానికి 32 ఏళ్ళ ముందు ‘పైఘామ్’లో వీరద్దరూ కలసి నటించారు. అందులో దిలీప్ కుమార్ కు అన్నగా రాజ్ కుమార్ కనిపించారు. నిజానికి వయసులో రాజ్ కంటే దిలీప్ నాలుగేళ్ళు పెద్దవారు. ‘పైఘామ్’ తరువాత వారిద్దరూ కలసి నటించకపోవడానికి పలువురు పలు రకాలుగా చెబుతారు. ఇద్దరూ ‘మెథడ్ యాక్టింగ్’లో నిష్ణాతులే అని పేరు సంపాదించారు. […]
విశ్వవిఖ్యాత నటరత్న నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన జానపదాల్లో అనేకం మేటి చిత్రాలుగా నిలిచాయి. వాటిలో యన్టీఆర్ హీరోగా కేవీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగదేకవీరుని కథ’ జనం మెచ్చే కథ,కథనంతో పాటు సంగీతసాహిత్యాలతోనూ అలరించింది. ఈ చిత్రం ఆగస్టు 9తో అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. 1961 ఆగస్టు 9న విడుదలైన ‘జగదేకవీరుని కథ’ చిత్రం అనూహ్య విజయం సాధించి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. యన్టీఆర్ – కేవీ రెడ్డి హ్యాట్రిక్!యన్టీఆర్ ను […]
బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా కొన్ని మ్యూజికల్ హిట్స్ ఎప్పటికీ జనం మదిలో చెరగని ముద్ర వేసుకొనే ఉంటాయి. అలాంటి వాటిలో సల్మాన్ ఖాన్, మనీషా కొయిరాల జోడీగా నటించిన ‘ఖామోషీ’ని గుర్తు చేసుకోవచ్చు. నిజానికి ఈ సినిమా పేరు వినగానే వీరికంటే ముందుగా నానా పటేకర్, సీమా బిశ్వాస్ గుర్తుకు వస్తారు. ఇందులో మూగ, చెవిటి పాత్రల్లో ఆ ఇద్దరూ అద్భుతమైన అభినయం ప్రదర్శించారు. వారి కూతురుగా మనీషా నటన సైతం ప్రశంసలు అందుకుంది. […]
పిల్లలను ఎలా పెంచాలి? అన్న దానిపై ఇప్పుడు బోలెడు పుస్తకాలు వస్తున్నాయి. కానీ, శాస్త్రకారులు ఏ నాడో చిన్న సూక్తుల్లోతేల్చి చెప్పారు. పిల్లాడిని పసితనంలో రాజులాగా, ఆ తరువాత సేవకునిలా, యవ్వనం వచ్చాక మిత్రునిలా చూసుకోవాలని కన్నవారికి సూచించారు. కానీ, కొందరు తల్లిదండ్రులు తమ అతిప్రేమతో పిల్లలు పెద్దవారయినా, ఇంకా పసిపిల్లల్లాగే చూస్తూ ఉంటారు. అది పిల్లలను వారికి దూరం చేస్తుందని ఆలోచించరు. తమ భావాలనే వారిపై రుద్దితే, పిల్లల్లో కన్నవారి పట్ల అభిమానం స్థానంలో ద్వేషం […]
ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం చేసారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన చీటర్స్… అమాయక ప్రజలను ఆన్లైన్ బిజినెస్ పేరుతో టార్గెట్ చేసారు. చైనాకి చెందిన సైబర్ చీటర్స్ కి నకిలీ కంపెనీల పేరుతో కరెంట్ అకౌంట్స్ తీసి ఇచ్చారు హైదరాబాద్ వాసులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఓ వ్యక్తి. దాంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసాడు […]
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొదటి ఇనింగ్స్ లో 183 పరుగులు చేయగా భారత్ 278 పరుగులు చేసి 95 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు పుంజుకొని 303 పరుగులు చేసింది. అయితే రెండు ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం 20 వికెట్లు భారత పెసర్లే తీయడం విశేషం. ఇక […]
అక్కడ పోస్టింగ్ కోసం బాగా సమర్పించుకుంటారు. పోస్టింగ్ వచ్చాక తమకు సమర్పించుకునే వాళ్లకోసం వెతుకుతారు. తప్పో ఒప్పో అక్కడికి వెళ్లారా సీన్ సితారే. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఏసీబీ దాడులు చేస్తున్నా సిబ్బందిలో మార్పు లేదు! ఏసీబీకి దొరికినా.. ఎవరు ఆరోపణలు చేసినా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ స్టాఫ్ తీరు అస్సలు మారడం లేదు. అదే స్టేషన్లో పదే పదే సిబ్బంది ఏసీబీ వలకు చిక్కుతున్నా తర్వాత వచ్చేవారిలోనూ మార్పు రావట్లేదు. ఏజెన్సీ ముఖద్వారంలో […]
తెలంగాణలో కరోనా కేసులు ఈరోజు తగ్గాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 449 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 623 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,406 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,37,175 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,825 కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు […]