రెండున్నరేళ్ల లో తెలంగాణ లో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే సంవత్సరం దళిత బంధు క్రింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తాం అని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. దళిత బంధు తో తమ కాళ్ళమీద తాము నిలబడేలా నిధులను సద్వినియోగం చేసుకోవాలి. రైతు బంధు మాదిరే దళిత బంధు దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తుంది. దళిత జాతికి సరికొత్త దశా దిశా చూపే కార్యక్రమం దళిత […]
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) స్కైట్రాక్స్ ప్రపంచ ఎయిర్ పోర్ట్స్ అవార్డులు-2021లో ‘బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్ ఇన్ ఇండియా & సెంట్రల్ ఏషియా’ అవార్డును గెల్చుకుంది. హైదరాబాద్ విమానాశ్రయం స్కైట్రాక్స్ అవార్డును గెల్చుకోవడం వరుసగా ఇది మూడోసారి. అలాగే ప్రపంచ టాప్ 100 విమానాశ్రయాలలో గత ఏడాది 71వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 64వ స్థానానికి చేరింది. హైదరాబాద్ విమానాశ్రయం ఈ క్రింది విభాగాలలో కూడా అవార్డులు గెల్చుకుంది: స్కైట్రాక్స్ కొన్ని నెలల క్రితం చాలా […]
మాదాపూర్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై జరిగిన దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నత ఆధికారుల బంధువు కావడంతోనే విషయం బయటికి రాకుండా చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనికేలు నిర్వహిస్తున్న సమయంలో… మమల్ని ఆపుతావా అంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై నే చేయి చేసుకున్నారు ఇద్దరు వాహనదారులు. దాంతో ఈ ఘటన పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. అయితే ఆ ఇద్దరి పై కేసు […]
ఆదివాసీ లను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి లో ఎలా సభ పెడుతుంది అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ప్రశ్నించింది. మా పండగ రోజు రాజకీయ సభకు ఎలా అనుమతి ఇచ్చారు.. ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ , రాష్ట్రప్రభుత్వందే భాద్యత అని తెలిపింది. ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కే రెండు సార్లు మోసం చేసింది. ఇప్పుడు మూడో సారి మా ఆదివాసీ దినోత్సవాన్ని హైజాక్ చేస్తోంది. 1976 లో కాంగ్రెస్ పార్టీ […]
మాజీ మంత్రి వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం రెండు ప్రాంతాల్లో మూడవ రోజు అన్వేషణ కొనసాగుతుంది. పులివెందులలోని రోటరీపురం వాగు, తూర్పు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని గరండాల వంకలో అన్వేషిస్తున్నారు . నిన్న వాచ్ మెన్ రంగన్న, ప్రకాష్ రెడ్డి, ఇనాయతుల్లా, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు శివ ప్రకాష్ లను విచారించిన సీబీఐ అధికారులు.. అనంతరం మరో కోత్త ప్రాంతంలో ఆయుధాల కోసం అన్వేషణ ప్రారంభించారు. వ్యర్థాలను తొలగిస్తున్నారు ఇరవై మంది మున్సిపల్ […]
ఆపరేషన్ ముస్కాన్ లో దొరికిన మైనర్లు పరారయ్యారు.పట్టుబడ్డ బాలలను సైదాబాద్ లోని జువైనల్ హోమ్ లో ఉంచారు సీడబ్ల్యూసీ సిబ్బంది. జువైనల్ హోమ్ నుండి పారిపోయారు పది మంది బాలురు. ఆదివారం సెలవు దినం, సిబ్బంది తక్కువగా ఉంటారని పారిపోయేందుకు ప్లాన్ వేశారు ఆ పది మంది బాలురు. నిన్న ఉదయం గేటు వద్ద సిబ్బంది ఒక్కడే ఉండటాన్ని గమనించి అతనిపై దాడి చేసి గేట్ తాళం తీసుకొని పారిపోయారు పది మంది. ఆ గేట్ దగ్గర […]
టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. ముగింపు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. 39 స్వర్ణాలతో అమెరికా టాప్ ప్లేసు సాధించింది. ఆ తర్వాతి స్థానాలను చైనా, జపాన్ పొందాయి. భారత్ మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. అసలు జరుగుతాయా, లేదా అన్న సందిగ్ధత నుంచి ఎన్నో అవాంతరాలను అధిగమించి టోక్యో ఒలింపిక్స్ జరిగాయి. ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన కరోనా.. ఒలింపిక్స్‌ను కూడా కమ్మేసింది. చివరికి ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. ముగింపు వేడుకలను గతంలో […]