సిద్దిపేటలో టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు బాల్క సుమన్, కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. గోబెల్స్ కన్నా తీవ్ర స్థాయిలో అబద్ద ప్రచారం.గొెబెల్స్ బ్రతికి ఉంటే బీజేపీ ప్రచార తీరు చూసి ఉరి వేసుకుంటాడు. 2014 లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాయి. హుజూరాబాద్ లో అసలు బీజేపీ వాళ్లు […]
ఇప్పుడా జిల్లాలో మంత్రిగారు పెట్టుకున్న ఉంగరం హాట్ టాపిక్. ఆయనకు కరోనా వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. పార్టీలో, కేడర్‌లో ఆ ఉంగరం చుట్టూనే చర్చ జరుగుతోంది. అసలే మంత్రివర్గ ప్రక్షాళనపై ఊహాగానాలు వస్తున్న వేళ.. అమాత్యులవారి చేతికి ఆ రింగ్ ఎందుకు వచ్చిందన్న ప్రశ్న ఆసక్తిగా మారింది. ఆయనెవరో.. ఆ ఉంగరమేంటో.. ఈ స్టోరీలో చూద్దాం నారాయణస్వామి ఉంగరంపై చర్చ! నారాయణ స్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నుంచి వరసగా […]
ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి. కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కలిగిస్తోంది. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. లోకేష్ మంగళగిరిలో ఓడిన తర్వాత అయినా వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని […]
పిఆర్సీ అమలు చేసిన సందర్భంగా సిద్దిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వంకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేసారు. దీనికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంటింటికి నీళ్లు ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి షెకావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. వారు బీజేపీ అయినా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు అంటే పని చేస్తేనే ప్రశంసిస్తారు అనే మాట గుర్తుంచుకోవాలి. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయం లో తెలంగాణ […]
టీటీడీ బోర్డు చైర్మన్ గా మరోసారి తనకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వైవి సుబ్బారెడ్డి. తాజాగా ఎన్టీవీతో మాట్లాడినా ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు. నాకు మరోసారి చ్చినందుకు సంతోషిస్తున్న. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే. భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతా.. టీటీడీలో గతంలో […]
అనకాపల్లి తాళ్లపాలెంలోని రేషన్ డిపో లో ఆకస్మికంగా తనిఖీలు చేసారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు సరఫరా పై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న రేషన్ బియ్యం, సరుకులు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్న ఆర్థిక మంత్రి… కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యన్ని కేంద్రం పేరుతోనే ఇవ్వాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం […]
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 2,050 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,82,308 కు చేరింది. ఇందులో 19,48,828 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 19,949 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 18 మంది […]
కరీంనగర్ జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సానిటీజర్ తాగి వివాహిత దివ్య ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమెను అడ్డుకున్న కుటుంబ సభ్యులు… పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించారు. భర్త పై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆందోళన చేస్తుంది. బాధితురాలికి తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు భర్త మురళీ కృష్ణ. 2007లో దివ్యకు తెలియకుండా సుజాతను వివాహం చేసుకున్నాడు మురళి కృష్ణ. 2017లో దివ్యను రెండో వివాహం చేసుకుని […]