బంజారాహిల్స్ లో ఓ నకిలీ ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఖమ్మం సిఐ పేరుతో ఒక వైద్యుడుకి ఫోన్ చేసి 75 లక్షలు డిమాండ్ చేసాడు నిందితుడు. గతంలో తన ఇంట్లో డ్రైవర్ గా పని చేసాడు మహేష్ అనే వ్యక్తి. అయితే మహేష్ వద్ద వైద్యుడుకి సంబందించిన కాల్ రికార్డింగ్ లు ఉండటంతో అతడిని విధుల్లో నుండి తొలగించాడు వైద్యుడు. మహేష్ తనకు తెలిసిన వ్యక్తి తో నకిలీ పోలీస్ అవతారం ఎత్తించి వైద్యుడికి ఫోన్ చేయించాడు. […]
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదయ్యింది. బొల్లారంలోని మారుతీనగర్కు చెందిన బ్యాగరి నర్సింహులు(41) పాత సినిమాల రిస్టోరేషన్ టెక్నీషియన్గా పనిచేస్తుంటాడు. అయితే దర్శకుడు దాసరి నారాయణరావు వద్ద 2012 నుంచి 2016 దాకా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సినిమాల రిస్టోరేషన్ పనులు చేశాడు. దాసరి మృతి తర్వాత కూడా పెండింగ్లో ఉన్న పనులను జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లి పూర్తి చేశాడు. […]
కాకినాడ స్థానిక డైరీ ఫారం సెంటర్ వద్ద గల బిస్ఎన్ ఫిల్లింగ్ స్టేషన్ నందు విక్రయిస్తున్న పెట్రోల్ కారణంగా గత మూడు రోజులుగా అనేక వాహనాలు చెడిపోవడం తో గత మూడు రోజుల గా వాహనదారులులు నిరసనలు తెలియజేస్తున్నారు, వాహనదారులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నా ,సివిల్ సప్లై అధికారులు ఏ మాత్రం తొంగి చూడకపోవడం తో వాహనదారులు సంబంధిత అధికారులు తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సుమారు వందకు పైగా వాహనాలు చెడిపోగా,పది వాహనాలను […]
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన పై సస్పెన్స్ కొనసాగుతుంది. పోలీసుల ముమ్మర దర్యాప్తు చేస్తున్న కేసు చిక్కుముడి వీడటం లేదు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కని సీసీ ఫుటేజ్ లో గుర్తించిన చిలకల గూడ పోలీసులు.. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. అయిన బాధితురాలి అక్క ఆచూకీ లభించడం లేదు. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే సీసీ ఫుటేజ్ తో పాటు కొన్ని ఆధారాలు సేకరించింది క్లూస్ టీం & పోలీసులు. […]
భారత్ లో “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడచిన 24 గంటలలో 35,178 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…440 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 37,169 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,85,857 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,67,415 కు చేరగా…“కరోనా”కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య […]
విశాఖపట్నం లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన “రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్” ( వైజాగ్ స్టీల్) ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి చూపుతుంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సి.ఇ.ఓ, మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్ నిర్ధారించారు. విశాఖపట్నంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు కర్మాగారం ఇది. భారతదేశంలో సముద్ర తీరాన ఉన్న అతి పెద్దదైన సమగ్ర ఉక్కు కర్మాగారం దీని […]
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు తమ్ముళ్ల కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? పార్టీ అధికారంలో లేకపోయినా వెనక్కి తగ్గడం లేదా? ఇప్పట్లో ఆ తగువులు కొలిక్కి వస్తాయో లేదో కూడా తెలియదా? పార్టీ పెద్దలు కూడా తలపట్టుకుంటున్నారా? ఇంతకీ ఆ నియోజకవర్గమేంటీ? తమ్ముళ్లు ఎందుకు కీచులాడుకుంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం. కొవ్వూరు టీడీపీలో కుమ్ములాటలు! పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా.. ఎవరి గ్రూప్ వాళ్లదే. పార్టీ వేదికలపైనే కాదు.. సోషల్ […]
ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సీఎం జగన్ ప్రస్తావించారా? ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? సీఎం నన్ను అన్నారంటే.. కాదు కాదు నన్నే అన్నారు అని కమలనాథులు ఎందుకు పోటీపడి చెప్పుకొంటున్నారు? ఏంటా రగడ? లెట్స్ వాచ్! ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించిన సీఎం? ఏపీ బీజేపీ నేతలను కట్టడి చేయాలని సీఎం జగన్ మంత్రులను ఇటీవల ఆదేశించారు. అఫీషియల్ […]
సోనూ సూద్… కరోనా కష్ట కాలంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి తాను రిల్ స్టార్ కాదు రియల్ స్టార్ అని అనిపించుకున్నాడు. దేశంలో ఏ మూలాన ఎవరు సహాయం కోరిన వారికి సహాయం అందించాడు. దాంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సోనూ సూద్. అయితే ఈ రియల్ స్టార్ అభిమానులు చాలా మంది చాలా రకాలుగా సోనూ సూద్ పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కొందరైతే వేల కిలోమీటర్లు కాలి […]
సీఎం రాజకీయ కార్యదర్శిఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అభిమానులు ప్రతి గ్రామంలో హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మెదక్ టౌన్ లో ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా రక్తం కొరత ఏర్పడినందున ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. దాదాపు నియోజకవర్గంలో మొత్తం ఐదు వేల మొక్కలు నాటడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం […]