దళిత బంధు కింద కేసీఆర్ ఇస్తామని చెప్తున్న 10 లక్షలు ఆయన సొంత డబ్బు కాదు అని చెప్పిన భట్టి విక్రమార్క ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఒక భాగం మాత్రమే అన్నారు. దీన్ని ఏదో ఒక్క నియోజక వర్గంలో పరిమితం చేయొద్దు. రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేయాలి అని తెలిపారు భట్టి. కో ఆర్డినెటర్లు నియోజక వర్గాలలో ఈ విషయాలను బాగా విస్తృత ప్రచారం చేయాలి అని సూచించారు. నియోజక […]
ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల పాటు ఈ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టాలి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపాడు. డీసీసీలు ఈ విషయంలో చాలా సీరియస్ గా పని చేయాలి. ఈ విషయంలో సామాజిక కోణం ఉంది. నియోజక వర్గాల వారీగా నివేదికలు తయారు చేయాలి. బాగా పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుంది. 119 నియోజక వర్గాలకు ఇంచార్జి కు […]
అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడం పట్ల.. అఫ్ఘాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలు తమ సిబ్బందిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాలిబన్ల ధాటికి ప్రభుత్వ సేనలు చెల్లాచెదురవడంతో.. ఊహించిన దానికంటే ముందుగానే అఫ్ఘానిస్థాన్.. తాలిబనిస్థాన్ గా మారింది. 20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించారు. ఒకటొకటిగా అఫ్ఘానిస్తాన్‌లోని కీలక పట్టణాలన్నింటినీ […]
మనసులు మారుతున్నాయా? పాత స్నేహాలు నెమరేసుకుంటున్నారా? కొత్త సమీకరణాలకు సరికొత్తగా తెర లేస్తోందా? ఉమ్మడి శత్రువుపైకి కలిసికట్టుగా దండెత్తబోతున్నారా? ఏపీ రాజకీయ ముఖచిత్రంలో మార్పులకు ఈ కలయికలు సంకేతామా.? అంతా ఏకమయ్యే అజెండాపై ప్రతిపక్షాలు ఫోకస్? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అందరికీ తెలిసిందే.. ఈ మధ్య అందరూ చూస్తోందే. ఏపీలో అదే సీన్ మళ్లీ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ చేతిలో కకావికలమైన విపక్షాలు ఒకే గూటికి […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 68,041 సాంపిల్స్ పరీక్షించగా.. 1,433 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 15 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,815 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,102కు పెరగగా… రికవరీ కేసులు 19,67,472కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,686 […]
ఆయన మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నేత. ఆ నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జ్ కూడా. ఉన్నట్టుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న ఇంఛార్జ్ పదవిని పీకేసింది పార్టీ. కొత్త నాయకుడిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. ఎందుకీ మార్పు? మాజీ ఎమ్మెల్యే ఎందుకు రుచించలేదు? టీడీపీ ఇంఛార్జ్ పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే తొలగింపు పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు కూలుతున్నాయి. కేడర్ చెల్లాచెదరవుతోంది. ఇలాంటి నియోజకవర్గాలపై టీడీపీ అధిష్ఠానం ఫోకస్ పెడుతోంది. ఎన్నికలకు రెండున్నరేళ్లు […]
రమ్య మరణం పట్ల సమాజం దిగ్భ్రాంతి చెందింది. ఇంతటి అరాచకం నా రాజకీయం లో చూడలేదు అని మాజీ మంత్రి ఆలపాటి రాజ అన్నారు. ఒక విద్యార్థిని హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ పై కేసులా… పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కేసులు పెట్టిన తీరు కేసుల్లో చెప్పిన సమయానికి పొంతన లేదు. పోలీస్ అధికారులు నిస్పక్ష పాతం గా వ్యవహరించాలి. పోలీస్ లు రక్షకులు గా కాదు భక్షకులు గా మారి పోయారా […]
వినాయక నిమజ్జనంపై తమకు వివరాలు సమర్పించాలని మరోసారి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు… రసాయనాలతోకూడిన విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా చర్యలేమిటి అని ప్రశ్నించింది. ఇక సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. హుస్సేన్ సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల […]
పొలిటికల్ లీడర్‌గా మారిన ఆ మాజీ ఐపీఎస్.. అప్పుడే బరిపై గురిపెట్టారా? వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్‌కు కారణం కూడా అదేనా? ఇంతకీ ఆయన ఎంచుకున్న నియోజకవర్గాలేంటి? ఉమ్మడి నల్లగొండలోని మూడు నియోజకవర్గాలపై ప్రవీణ్ ఫోకస్? ఏనుగెక్కి ప్రగతిభవన్‌కు వెళ్తామని ప్రకటించిన బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఇదే జిల్లాలో సభ పెట్టడం దగ్గర నుంచి.. వచ్చే […]