సీఎం రాజకీయ కార్యదర్శిఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అభిమానులు ప్రతి గ్రామంలో హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మెదక్ టౌన్ లో ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా రక్తం కొరత ఏర్పడినందున ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. దాదాపు నియోజకవర్గంలో మొత్తం ఐదు వేల మొక్కలు నాటడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొక్కలు నాటడమే కాకుండా వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్సీ కోరారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సుభాష్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా సర్వమత ప్రార్థనలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు తన పుట్టిన రోజు సందర్భంగా అవసరం ఉన్నవారికి పేదలకు బట్టలు పంపిణీ చేశారు. దాదాపు నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమం లో పార్టీ నాయకులు అభిమానులు ఐదు వేల మంది పాల్గొన్నారు. పలు సేవా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేశారు.