ఒకరు చేతికి ఉంగరం పెట్టుకున్నారు. ఇంకొకరు కనిపించిన దేవుడికి మొక్కుతున్నారు. ఏకంగా గుడే కట్టించేశారు మరొకరు. వీటన్నింటికీ మూల మంత్రం ఒక్కటే. రేస్‌లో ముందుకెళ్లడమే. కొత్త పదవి చేపట్టడం.. లేదా ఉన్న పదవిని కాపాడుకోవడం. ఆ జిల్లాలో అధికారపక్ష నేతలు చేస్తున్న ఈ విన్యాసాలే ఇప్పుడు ఆసక్తిగా మారాయి. సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యం? దేవుడు కరుణించాలి. వరాలు కురిపించాలి. సామాన్య భక్తులు ఈ ఆశతోనే గుళ్లకు వెళ్తారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. రాజకీయ నాయకులైతే […]
అమెరికాతో వ్యవహారం రెండు వైపులా పదునైన కత్తిలాంటిదనే వ్యవహరం మరోసారి రుజువైంది . అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఎంతో వ్యూహాత్మంగా చబహార్ పోర్టుపై పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఆల్టర్నేట్ మిడిల్ ఈస్ట్ ఏషియా , యూరప్ దేశాలతో నేల మార్గం ద్వారా జరిగే వ్యాపారం ఇప్పటి వరకు ఎక్కువగా పాకిస్తాన్ మీదుగా జరుగుతోంది. దీంతో పాకిస్తాన్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ప్రత్యామ్నయంగా ఇరాన్లో చబహార్ పోర్టును అభివృద్ధి చేసేందుకు […]
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కేసులు మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. అయితే గాంధీ ఆసుపత్రి సామూహిక అత్యాచార ఘటనలో ట్విస్ట్ వచ్చింది. మెడికల్ రిపోర్ట్ నమూనాల పరీక్షల్లో మత్తు ప్రయోగం ఆనవాళ్లు లేవు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు నిందితులు తనకు క్లోరోఫాం, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలు నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్.. వీటి ఫలితాల్లో క్లోరోఫాం సహా […]
ఆయన మాజీ ఎమ్మెల్యే. అధికార పార్టీ నేత. మొన్నటి ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అయ్యేవారో లేదో కానీ.. ఓటమి మాత్రం కష్టాలు తెచ్చిపెట్టింది. స్వపక్షంలోని వైరివర్గాల ఎత్తుగడలతో పవర్ కట్ అయిందనే చర్చ జరుగుతోంది. పార్టీలో ఆయన మనుగడే కష్టమైందని టాక్. ఇంతకీ ఎవరా నాయకుడు? అధికార పార్టీలో ఎవరితో పడటం లేదు? ఎమ్మెల్యే చిరుమర్తి చేరిక తర్వాత వీరేశానికి కష్టాలు? వేముల వీరేశం. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే. 2014లో టీఆర్ఎస్ టికెట్‌పై […]
రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ఎత్తుగడలు సహజం. ఎప్పుడు ఏం అంశం కీలకమవుతుందో ఊహించలేం. ఎప్పుడెలా పరిష్కారం లభిస్తుందో చెప్పలేం. ఆ విధంగా చర్చల్లోకి వచ్చిందే తెలంగాణ CMO. ఒక్క దళిత అధికారి కూడా లేరన్న విపక్షాల విమర్శలకు విరుగుడు మంత్రం వేసింది అధికారపక్షం. అదేంటో ఈస్టోరీలో చూద్దాం. సీఎంవోపై విమర్శలకు ప్రభుత్వం విరుగుడు మంత్రం! హుజురాబాద్ ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాల్లో అనేక అంశాలు చర్చల్లోకి వస్తున్నాయి. సమయం.. సందర్భాన్ని బట్టి ప్రత్యర్థులను ఇరుకున […]
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ పిల్ పై సీజే హిమాకోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపారు. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారన్నారు పిటిషనర్. […]
విశాఖ,దేవరాపల్లి, హాల్ సేల్ యగూరలు మార్కెట్ లో గిట్టుబాటు ధరలేక కాయగూరలు రోడ్డుపై పారబోసారు రైతులు. మార్కెట్ వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్ కారును ఆపీ కారుకు అడ్డంగా కాయగూరలు పారబోసి నిర్సన తెలిపారు రైతులు. దళారీ బారినుండి కాపా డాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. పాడేరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్వపారులను అడ్డు కోని స్థానిక వ్యపారులు సిండికేట్ కా ఎర్పడి రైతులను మోసంచేస్తున్నారు వ్యపారులు. గత ఆరవైసంవత్సరాలు నుండి దేవరాపల్లి […]
కర్నూలు ఆలూరు మండలం హులేబీడు, తుమ్మల బీడు గ్రామాల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. మోహరం వేడుకల వివాదంతో ఈ ఘర్షణ జరిగింది. తుమ్మలబీడు పీరులు హులేబీడు రావడం అక్కడి ఆనవాయితీ. కానీ ఈసారి తుమ్మల బీడు స్వామి హులేబీడు కు రాకూడదని స్థానికులు ఆంక్షలు విధించారు. కానీ ఆనవాయితీ ప్రకారం తుమ్మలబీడు పీరులు హులేబీడు లోకి రావడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు గ్రామాల ప్రజలు పరస్పర దాడులకు పాల్పడటంతో పలువురికి […]