దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.44,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 తగ్గి రూ.48,280కి చేరిది. కానీ బంగారం ధరలు […]
తెలంగాణకు హరిత హారం స్పూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, సీడ్ బాల్స్ తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు’’ జ్జాపికను శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కెసిఆర్ చేతులమీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు అందుకున్నారు. వారి కృషిని సీఎం కెసిఆర్ అభినందించారు. […]
హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు పోటీ చేయాలి అని వైస్సార్ తెలంగాణ పార్టీ తెలిపింది. రాష్ట్రంలో నిరుద్యోగులు వందల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోంది. నోటిఫికేషన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. రేపు, మాపు అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతోంది. యువత ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే.. వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి కేసీఆర్ మెడలు వంచాలని వైస్సార్ తెలంగాణ […]
రాకరాక వారికి ఓ అవకాశం వచ్చింది. అక్కడ జగనన్న.. ఇక్కడ దాసన్న అండ ఉందని పదేపదే చెప్పుకొని మురిసిపోయారు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారానికి ప్లాన్ చేస్తే.. వేదిక వెలవెల పోయిందట. కట్‌చేస్తే ఇప్పుడు ఆ అంశంపై వైసీపీలో అదేపనిగా చెవులు కొరుక్కుంటున్నారట. వీళ్లు పిలవలేదా లేక.. వాళ్లే రాలేదా అని చర్చించుకుంటున్నారట. గ్రాండ్‌గా సుడా ఛైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారోత్సవం! శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడంతో ఇక్కడి వైసీపీ నేతలకు సీఎం జగన్ మనసులో ప్రత్యేక […]
చియాన్ విక్రమ్ నటిస్తున్న 60వ చిత్రానికి ‘మహాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను, మేకింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విక్రమ్ అభిమానులకు అందించారు. విక్రమ్ తనయుడు ధ్రువ్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ధ్రువ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంటే, గ్యాంగ్ స్టర్ గా డిఫరెంట్ గెటప్ లో విక్రమ్ దర్శనం ఇవ్వబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,899 సాంపిల్స్ పరీక్షించగా.. 359 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 494 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,394 కు చేరగా.. రికవరీ కేసులు 6,43,812 […]
ఏపీలో 11 మంది డెప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. శ్రీశైలం ఈవోగా లవన్న నియమించబడటంతో జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా శ్రీశైలం ఈవో కేఎస్ రామారావుకు ఆదేశాలు జారీ చేసారు. ఇక కోవూరు ఆర్డీఓగా ఏక మురళి, అమలాపురం ఆర్డీఓగా వసంత రాయుడు, ఏపీఎస్సీసీఎఫ్‌సీ కృష్ణా జిల్లా ఈడీగా చంద్ర లీల, గురజాల ఆర్డీఓగా పార్థసారధి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ పీఏగా వసంత బాబు, కడప మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్‌గా రంగ స్వామి, నర్సిపట్నం ఆర్డీఓగా గోవింద రావు, […]
అది తొమ్మిది జిల్లాలకు హెడ్ ఆఫీస్. నిన్న మొన్నటి వరకు ఆ శాఖకు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా తెలియదు కూడా. అలాంటిది ఇప్పుడు ఆధిపత్యపోరు మొదలైంది. దానికి రాజకీయ సెగ తగలడంతో ఒక్కటే చర్చ. ఇంతకీ ఆఫీస్ ఏంటి? ఎందుకు వివాదాస్పదంగా మారిందో ఈ స్టోరీలో చూద్దాం. ఇంటర్ విద్యలో 9 జిల్లాలకు వరంగల్ ఆర్వో ఆఫీస్ కేంద్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే ఇంటర్‌బోర్డులో మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో […]
సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించారు. అధికార బిజేపి ని దీటుగా ఎదుర్కుని నిలువరించేందుకు, భావసారూప్యతగల పార్టీ లన్నింటినీ ఏకం చేసి, మరింత బలీయమైన ఉమ్మడి పోరుకు సన్నధ్దమౌతున్నారు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన ఉమ్మడి పోరు ను మరింత సమర్ధవంతంగా కొనసాగించేందుకు, ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టంచేసేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల […]
ఏపీ గవర్నరును కలిశారు టీడీపీ నేతలు. జీవోలు పబ్లిక్ డొమైనులో పెట్టకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందనుకు టీడీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ… జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా తేదీ, జీవో నెంబర్ వేసి వదిలేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జీవోలు ఆన్లైన్లో పెట్టాలని ఆదేశాలిచ్చింది. రాత్రి పూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం జీవోలు ఆన్లైన్లో పెడుతుందా లేదా అనేది ఒక వారం రోజులు […]