కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ పై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఫిజిక్స్ పేపర్ లీకేజీ ఘటన, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై సీరియస్ అయ్యింది. ఎస్ యూ పరీక్షల విభాగం అధికారులను వివరణ కోరారు ఛైర్మెన్ పాపిరెడ్డి. సెల్ ఫోన్ ఆధారంగా లికేజీకి పాల్పడ్డ వారిని గుర్తించినట్లు సమాచారం. దాంతో ప్రభుత్వ ప్రవేటు కళాశాలల నిర్వహకుల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే ఓ ప్రవేటు కాలేజీకి చెందిన విద్యార్థులు సెల్ ఫోన్ చూస్తూ ప్రశ్నలకు జవాబులు […]
ఇండియాలో కరోనా కేసులతో పాటుగా మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కొత్తగా 34,457 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,93,286 కి చేరింది. ఇందులో 3,15,97,982 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,61,340 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 375 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,33,964 కి చేరింది. […]
ఈ రోజు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర జరగనుంది. ఇందుకోసం వస్తున్న కేంద్రమంత్రికి ఘట్కేసర్ వద్ద స్వాగతం పలకనున్నారు మేడ్చల్ జిల్లా బీజేపీ అధికారులు.నేడు మధ్యహ్నం 12 గంటలకు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కిషన్ రెడ్డికి హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకనున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50కిలోమీటర్ల జన ఆశీర్వాద యాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు బీజేపీ కార్యాలయం వద్ద బహిరంగ సభ, కిషన్ […]
వెనక్కి వెళ్ళే హడావుడిలో అమెరికా పెద్ద తప్పే చేసింది. తన ఆయుధ డంపులను అఫ్గాన్‌లోనే వదిలేసింది. ఈ నిర్లక్ష్యం తాలిబన్లకు వరంగా మారింది. సుల్తాన్‌ఖిల్ సైనిక స్థావరంలోని కంటైనర్ల కొద్దీ ఆయుధాలు, వాహనాలు తాలిబన్ల సొంతమయ్యాయి. అప్ఘాన్ సేన కోసం అమెరికా ఇరవైఏళ్లుగా అనేక ఆధునాతన ఆయుధాలను భారీగా సమకూర్చింది. అమెరికా భాగస్వామ్యంలో అందించిన బోలెడు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు, ఎన్నో సైనిక మౌలిక వసతులు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఇంతకాలం అందని వైమానిక సంపత్తి […]
టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. కోహ్లీ సారథ్యంలోని…. టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టెస్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఓడిపోయింది. దీంతో రాబోయే ఐసీసీ ట్రోఫీలను కచ్చితంగా గెలవాల్సినా వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టీ-20 ప్రపంచకప్‌కు జట్టు కూర్పుపై కుడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఈ ఏడాది […]
శ్రీశైలం జలాశయంలో వరద నీరు కొనసాగుతుంది. ఇప్పటికే కృష్ణ నది పై ఉన్న శ్రీశైలం జలాశయంలోకి వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 38,869 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 42,210 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 878.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 180.6725 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుండి […]
ఐపీఎల్ రెండో దశ సమీపిస్తుండటంతో సందడి పెరుగుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ యూఏఈకి చేరుకున్నాయి. ఐపీఎల్ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌లో అడుగుపెట్టింది డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్. ఆరు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని సాధన కూడా మొదలు పెట్టేసింది. రెండోదశలో తన తొలిమ్యాచులో రోహిత్‌సేన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. మూడు రోజుల క్రితమే యూఏఈ చేరుకున్న ధోనీసేన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 21న, సన్‌రైజర్స్ హైదరాబాద్ 31న అక్కడికి […]
మేషం : వస్త్ర, బంగారం, వెండి ఫ్యాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు ఆలయాలలో సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వృషభం : ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మతులు చేపడతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. […]
మంత్రి సత్యవతి రాథోడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… క్రిష్ణా జలాలో తెలంగాణ వాటా గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాం. కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో….ఈ అంశం కోర్టుకి వెళ్లింది. మిగులు జలాలను వినియోగించుకోవాలని ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చినా స్పందించలేదు అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగితే దేవుడితో అయిన పోరాటం చేస్తారు కేసిఆర్ అని చెప్పిన మంత్రి హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు తథ్యం అన్నారు. ఇక ఇదిలా ఉంటె ఈరోజు తిరుమల […]