ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోవడంతో బెంగళూర్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ సమయంలో ఇసుక తుఫాన్ కారణంగా టాస్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి ఈ జట్లు. ఒకవేళ ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే మొదటి ప్లేస్ లో ఉన్న ఢిల్లీని కిందకి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఇక గత మ్యాచ్ తో పోలిస్తే రెండు ఛేంజ్ లతో ఆర్సీబీ బరిలోకి దిగుతుండగా ధోనిసేన ఎటువంటి మార్పు లేకుండానే వస్తుంది.
బెంగళూర్ : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భరత్ (w), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, టిమ్ డేవిడ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (c/w), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్