06 అక్టోబర్ 2021నుండి వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమునకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. దక్షిణ […]
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాటల మంటలు రేపారు.. సినిమా సమస్యలతోపాటు రాజకీయ అంశాలను లేవనెత్తారు. వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ సంధించిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు వైసీపీ మంత్రులు, నేతలు, సానుభూతి పరులు రంగంలోకి దిగారు. ప్రతీగా జనసైనికులు సైతం నిరసనలకు దిగడంతో తెలుగు రాజకీయం రంజుగా సాగింది. దీంతో జనసేన వర్సెస్ […]
ముహూర్తం దగ్గర పడుతోంది. అలాగే ఆశావహుల్లో టెన్షన్ కూడా పెరిగిపోతోంది. జిల్లాకు ఎన్ని పదవులు వస్తాయో ఏమో కానీ.. వాటికోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య మాత్రం చాలానే ఉంది. అయితే సీనియారిటీ, సామాజిక కోణాల్లో అధినేత వేటికి ప్రాధాన్యం ఇస్తారో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆశావహులు. అనంతలో మంత్రి పదవి కోసం ఐదుగురు పోటీ..! ప్రస్తుతం అనంతపురం అధికారపార్టీలో వినిపిస్తున్నది ఒక్కటే మాట. నెక్ట్స్ మంత్రిగా ఎవరికి ఛాన్స్ వస్తుంది. త్వరలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు అవకాశాలు […]
నవ్యాంధ్రలో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీస్తుందనడానికి కిందటి సార్వత్రిక ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకానీ రీతిలో జగన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ ఏకంగా 151 సీట్లను సాధించి ఘనవిజయం సాధించింది.. వైసీపీకి ఈ గెలుపు చిరస్మరణీయమైన గుర్తుగా మిగిలిపోగా.. ప్రతిపక్షాలకు మాత్రం పీడకలను మిగిల్చాయి. నాడు మొదలైన వైసీపీ వేవ్ నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగింది. […]
ట్రాజెడీ, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్… ఇలా సినిమాల్లో పలు తెగలు ఉన్నాయి. అయితే అన్నీ కలిపి రెండే రెండుగా విభజించారు. అవే సుఖాంతం, దుఃఖాంతం. బాధతో ముగింపు కనిపించే ఏ సినిమా అయినా ట్రాజెడీయే. ఇక సంతోషంగా ముగిసే ఏ చిత్రమైనా హ్యాపీ ఎండింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ చివరలో మరణిస్తే అది ట్రాజెడీయే, హీరో, హీరోయిన్ కలుసుకోక పోయినా దానినీ విషాదాంతం అనే చెప్పాలి. ఇలా సినిమా తొలినుంచీ సాగుతూ, ప్రేక్షకుల ముందు […]
జనసేనాని వ్యూహం మారుస్తున్నారా? కొత్తగా పాత మిత్రుడి వైపు చూస్తున్నారా? రాష్ట్రాభివృద్ధి కోసం వ్యూహం మారుస్తానని పవన్ అనడం వెనక ఉద్దేశం.. బీజేపీని వీడటమా? టీడీపీతో జతకట్టడమా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెబుతున్నా.. పవన్ అదే అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం ఏపీ రాజకీయాలలో పొడుస్తున్న కొత్త పొత్తులకు సంకేతమేనా? అవసరమైతే వ్యూహం మారుస్తానన్న పవన్..!టీడీపీతో జత కట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? బీజేపీ-జనసేన పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇప్పుడంతా బాగానే ఉన్నట్టు […]
హుజురాబాద్ బైఎలక్షన్ ఆ ఇద్దరు మంత్రులకు పరీక్షేనా? వారి రాజకీయ భవిష్యత్ ఉపఎన్నిక ఫలితంపై ఆధారపడి ఉందా? అందుకే కంటిపై కునుకు లేకుండా పోయిందా? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరా మంత్రులు.. ఏమా కథా? హుజురాబాద్‌లో ఇద్దరు మంత్రులపై ఎక్కువ చర్చ..! హుజురాబాద్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా ఉపఎన్నికల్లో నిలబెట్టుకోవాలన్నది అధికార టీఆర్‌ఎస్ ఆలోచన. ఈటల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన మరుక్షణం గులాబీ శ్రేణులు ఇక్కడ మోహరించి పక్కా వ్యూహంతో వెళ్తున్నాయి. షెడ్యూల్ […]
టీడీపీ అధికారానికి దూరమై దాదాపు రెండున్నేళ్లు కావస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇదిలా ఉంటే.. ఆపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన నేతలంతా మిన్నకుండిపోతున్నారు. దీనికితోడు సొంత పార్టీపైనే బహిరంగంగా విమర్శలు చేస్తూ అభాసు పాలవుతున్నారు. కొద్దిరోజులుగా టీడీపీలోని కొందరు సీనియర్లు అధినేతపై ధిక్కార స్వరాన్ని విన్పిస్తుండటం […]
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర లేఖ రాసారు. ఇది రైతు ప్రభుత్వమా..? దగా ప్రభుత్వమా అంటూ ధూళిపాళ బహిరంగ లేఖలో ప్రశ్నించారు. ఆ లేఖలో… విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతుల్ని దొంగల్లా చూస్తున్నారన్న భావన కల్పిస్తున్నారు. రైతు భరోసా అమల్లో కులం పేరు చెప్పి లబ్దిదారుల్లో కోత విధించారు. రైతు భరోసా లబ్దిదారులను 64 లక్షల నుంచి 45 లక్షలకు కుదించారు. 15 లక్షల కౌలు రైతులకు రైతు భరోసా […]
కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన వినాశనం ఇంకా మన కళ్లలో మెదులుతూనే ఉంది. ఆ పాపంలో ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది. ఎన్నికల సభలు సూపర్ స్ప్రెడర్స్ గా మారాయి. తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా ఒక కారణం. ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉన్న సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. హుజూరాబాద్‌లో ప్రధాన ప్రత్యర్థులు ప్రచార వేగం పెంచారు. నేతల వెంట జనం గుంపులు గంపులుగా తిరుగుతున్నారు. […]