తెలుగు రాష్ట్రలో గులాబ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు తోడు ఎగువ నుండి కూడా కొంత ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ కు మళ్ళీ వరద పోటెత్తింది. అయితే ఇప్పటికే సాగర్ నిండు కుండ లా మారింది. దాంతో సాగర్ ప్రాజెక్ట్ 6 క్రస్టు గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ జలాశయానికి 63,080 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో ఉండగా ప్రాజెక్ట్ 6 […]
తెలంగాణలో ఈటల రాజీనామా తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. అయితే నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు నుండి ఈనెల 8 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక అభ్యర్థులు […]
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. నిన్నటి రోజున స్వామివారిని 28422 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 12058 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండీ ఆదాయం 2.36 కోట్లుగా ఉంది. అయితే ఈ నెల 5వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఆ కారణంగా 5వ తేదిన విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. 6వ తేదిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనుండగా…7వ తేది నుంచి […]
పంజాబ్ డిజిపి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటా ను తొలగించాలన్న సిధ్దూ డిమాండ్ కు ముఖ్యమంత్రి చరణజిత్ సింగ్ ఛన్ని సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొన్నిసార్లు భావావేశానికి లోనౌతారనే విషయం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి తెలిసిందేనని, అర్దం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు సిధ్దూ సలహాదారు మహమ్మద్ ముస్తాఫా. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో ముఖ్యమంత్రి ఛన్ని తనను సంప్రదించలేదని, బేఖాతరు చేశారనే ఆగ్రహంతో పాటు, పంజాబ్ డిజిపి, అడ్వకేట్ జనరల్ నియామకాల పట్ల […]
అధికారంలో ఉన్నప్పుడు వారంతా చక్రం తిప్పారు. పైగా పార్టీలో సీనియర్లు. ప్రస్తుతం అనేక సవాళ్లు ఆహ్వానిస్తున్నా.. చప్పుడు చేయరు. హుజురాబాద్ ఉపఎన్నికపైనా నాన్చుడే. అన్నింటికీ తామే అని చెప్పే నేతలు..ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? హుజురాబాద్‌ను పీసీసీ చీఫ్ సీరియస్‌గా తీసుకున్నారా లేదా? హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ప్రచార హోరులో కాంగ్రెస్ జెండా కనిపించడం లేదు. ఇంకా పాత కాలపు ఎత్తుగడలే. హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించడానికీ కాంగ్రెస్ నానా తంటాలు పడుతుంది. కొండా సురేఖ […]
32శాతం దలితులు ఉన్న రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసిన ఘనత రాహుల్, సోనియా గాంధీ లదే అని భట్టి విక్రమార్క అన్నారు. దళిత సీఎం ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే అమరేందర్ సింగ్ ను బీజేపీ నేతలు ఢిల్లీ కి పిలుపించుకున్నారు.. దళిత తుడికి సీఎం ఇవ్వడాన్ని అందరూ స్వాగతించాలి… కానీ పంజాబ్ లో రాజకీయ సంక్షోభం వచ్చినట్లు గా చూపెట్టడం సరైంది కాదు. దీన్ని నేను ఖండిస్తున్నా అని […]
ఆ డిప్యూటీ సీఎంను రెండు నీటి ప్రాజెక్టులు తెగ ఇబ్బంది పెడుతున్నాయట. మంత్రి పదవి చేపట్టగానే వెంటనే పూర్తి చేస్తామని చిటికెలు కూడా వేశారట. చూస్తుండానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఎక్కడి గొంగళి అక్కడే. అమాత్యుల వారికి కూడా చికాకు మొదలైందట. ఇంతకీ ఎవరా మంత్రి? అధికారంలో ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? కృష్ణాపురం, ఎన్టీఆర్ జలాశయాలను అభివృద్ధి చేస్తానని హామీ..! ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే. ఇక్కడ వరసగా […]
మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రను హజురాబాద్‌లో ఘనంగా ముగించాలన్నది బీజేపీ ఆలోచన. వారికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. ఇప్పుడేం చేస్తారు? కమలనాథుల ప్లానింగ్ ఏంటి? ఎన్నికల కోడ్‌తో సంజయ్ యాత్ర ముగింపుపై బీజేపీలో చర్చ..! తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్టు 28న ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. ఉపఎన్నిక జరగుతున్న హుజురాబాద్‌లో అక్టోబర్ రెండున భారీ రోడ్ షోతో మొదటి విడత యాత్రను ముగించాలని అప్పట్లో అనుకున్నారు. నిన్న మొన్నటి […]
జమ్మికుంట పట్టణంలో వడ్డెర సంఘం గర్జన మీటింగ్ కు ముఖ్య అతిధిగా కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అక్కడ మాజీ మంత్రి ఈటల మాట్లాడుతూ… ఎన్ని బెదిరింపులు చేసిన లొంగని జాతి వడ్డెర జాతి. కేసులు పెట్టుకోండి, జెసిబి లు సీజ్ చేసుకోండి కానీ తెరాసా జెండా కప్పుకొనేది లేదని చెప్పారు. దళితులకు అందరికీ దళితబంధు అందించాలి అని, అన్నీ కులాలలో ఉన్న పేద వారికి 10 […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ప్రతీ రోజూ వెయ్యికి పైగానే నమోదు అవుతూ వస్తున్నాయి.. అయితే, గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ కేసులే వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,054 శాంపిల్స్ పరీక్షించగా.. 1,010 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 13 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,149 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో […]