బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మరణంతో ఏపీలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో వైసీపీ తరుఫున దివంగత బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉండటంతో ఇక్కడ వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకే అన్న చందంగా మారింది. ఓటమిని ముందుగానే గుర్తించిన టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నాయి. అనుహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ రేసులో నిలువడంతో ఎన్నిక అనివార్యమైంది. […]
కరీంనగర్ జిల్లా అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు. అక్కడ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ… ఈటలకు ఈ ఎన్నికలో భారీ మెజారిటీ రావాలి. ఏ సర్వే చూసినా… ఈటలదే విజయం అని పేర్కొన్నారు. ఓడిపోతారు అని ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం వల్లనే కేసీఆర్ హుజూరాబాద్ మీటింగ్ కు రావడం లేదు అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఏప్రిల్ 27కి పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు […]
నిన్న ఎంతో ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో మేం మా ప్రణాళికలను అనుకున్న విధంగా అమలు చేయలేకపోయామని తెలిపాడు. ఆ కారణంగానే మేం ఓడిపోయాం అన్నారు. అయితే ఈ మ్యాచ్ లో క్రెడిట్ మొత్తం పాకిస్థాన్ జట్టుకే ఇవ్వాలని సూచించాడు. మేము ఇంకో 20 పరుగులు ఎక్కువ చేస్తే విజయం […]
అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్ కి ముఖ్య అతిథిలుగా ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… యువత మీరే ఎన్నికల ప్రచారం భుజాలమీద వేసుకొని పనిచేయాలి. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు భయపెట్టిన కూడా మన యువత భయపడడం లేదు. 27 తరువాత ఊర్లలో మీరే ఉంటారు. కెసిఆర్ డబ్బులు, మద్యం సీసాలు పాతర వేయల్సింది మీరే. మీరు కొట్టే దెబ్బ ఊహకు కూడా అందకూడదు. చరిత్రలో మంచి రాజులు, చెడ్డ […]
లక్ష రూపాయలు రుణమాఫీ చెయ్యకుండా నాన్చుతున్నరు. కేసీఆర్ హయాంలో పేదపిల్లలు చదువుకొనే 4 వేల స్కూల్స్ మూత బడ్డాయి అని విజయశాంతి అన్నారు. భూనిర్వాసితుల ఉసురుపోసుకున్నరు. డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు. బతుకమ్మ చేరెలు కట్టుకొనెలా ఉన్నాయా అని ప్రశ్నించారు. దొరగారు వస్తె రోడ్డుపక్కన మా అక్క చెల్లెళ్ళు దండం పెడుతూ నిలబడలా. ఇదా ఆడవారికి మీరు ఇచ్చే గౌరవం దొరగారు. 7 ఏళ్లుగా 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒక్క పథకం అమలు కాదు. […]
ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో త్వరగా వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ ఒక్క హాఫ్ సెంచరీతో రెండు రెసిర్డులు తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. ఈ టీ20 ప్రపంచ కప్ లో అర్థ శతకం బాదిన మొదటి భారత […]
కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు కొత్త కష్టమొచ్చిందా? సైకిల్ దిగేందుకు సిద్దపడినా.. ఏ పార్టీలో చేరాలో తెలియక సతమతం అవుతున్నారా? గ్రామాల్లో తిరుగుతూ.. రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించమని పార్టీ మారిన పాత కేడర్‌ను కోరుతున్నారా? ఇది ఎత్తుగడ.. ఇంకేదైనా వ్యూహం ఉందా? ఏ పార్టీలో చేరాలో చెప్పాలని గ్రామాల్లో అడుగుతున్నారట..! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో రాజకీయ సందడి మొదలైంది. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొత్తకోట దయాకర్‌రెడ్డి, […]
వీణవంక గడ్డ ఇచ్చిన చైతన్యంతోనే కేసీఆర్ ప్రజావ్యతిరేక పనుల మీద గర్జించిన అని ఈటల రాజేందర్ అన్నారు. ఐకేపీ సెంటర్స్ పెట్టాలని డిమాండ్ చేసిన. నర్సంపేట, పెద్దపల్లి ఎమ్మెల్యే లు, మంత్రి హరీష్ రావు ఈ మండలంలో తిరుగుతున్నారు. ఇక్కడే మీటింగ్ పెట్టి నన్ను విమర్శించారు. కేసీఆర్ పంతం పడితే హరీష్ పని చేస్తున్నారు. హరీష్ అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్ నీ ఆటలు ఈ గడ్డ మీద సాగవు అని తెలిపారు ఈటల. ఇక 70 కోట్ల […]
భార్య రాజకీయంగా కీలక పదవిలో ఉంటే… భర్త పెత్తనం చేయడం చాలాచోట్ల చూస్తుంటాం. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఆ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ అదే జరుగుతోందట. ఆయన పర్మిషన్ ఇస్తేనే ఫైల్ కదులుతోందని పార్టీ కేడర్.. అధికారులు కోడై కూస్తున్నారు. దేవుడు వరమిచ్చినా.. ఆయన కరుణ లేకపోతే పనే కాదట. ఆ బాగోతం ఎక్కడో ఏంటో ఇప్పుడు చూద్దాం. షాడో మేయర్‌గా మారిన భర్త? షేక్ నూర్జహాన్. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. వరసగా రెండోసారి […]
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 26,842 శాంపిల్స్ పరీక్షించగా… 135 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కోవిడ్ బాధితుడు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 168 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య […]