నిన్న ఎంతో ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో మేం మా ప్రణాళికలను అనుకున్న విధంగా అమలు చేయలేకపోయామని తెలిపాడు. ఆ కారణంగానే మేం ఓడిపోయాం అన్నారు. అయితే ఈ మ్యాచ్ లో క్రెడిట్ మొత్తం పాకిస్థాన్ జట్టుకే ఇవ్వాలని సూచించాడు. మేము ఇంకో 20 పరుగులు ఎక్కువ చేస్తే విజయం సాధించేవారము. కానీ, మా బ్యాటింగ్ లో మేము త్వరగా వికెట్లు కోల్పోవడం వల్ల మాకు అది సాధ్యపడలేదు అని కోహ్లీ అన్నాడు. అలాగే బౌలింగ్ సమయంలో కూడా మంచు ఎక్కువగా ఉండటంతో బౌలర్లు పట్టు సాధించ లేకపోయారు అని పేర్కొన్నాడు కోహ్లీ. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ కారణంగా భారత జట్టు 151 పరుగులు చేయగా పాకిస్థాన్ ఒక్క వికెట్ కోల్పోకుండా మరో 13 బంతుల్లో మిగిలి ఉండగానే విజయం సాధించింది.