ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో త్వరగా వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ ఒక్క హాఫ్ సెంచరీతో రెండు రెసిర్డులు తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. ఈ టీ20 ప్రపంచ కప్ లో అర్థ శతకం బాదిన మొదటి భారత కెప్టెన్ కోహ్లీ గా రికార్డు నెలకొల్పాడు. అలాగే టీ 20 వరల్డ్ కప్ లో అత్యధిక అర్ధ శతకాలు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ పొట్టి ప్రపంచకప్ లో మొత్తం 10 హాఫ్ సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత తొమ్మిది అర్థ శతకాలతో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ రెండవ స్థానంలో ఉంటె… హాఫ్ సెంచరీలతో శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్ధనే మూడో స్థానంలో ఉన్నాడు.