బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎక్స్ కేటగిరీగా ఉన్న ఈటల భద్రతను వై ప్లస్ కేటిరీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవినీతి చోటు చేసుకుంది సీఎంఆర్‌ఎఫ్‌లో జరిగిన అవినీతిపై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంపై సిఐడి దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటికి వస్తున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడంతోపాటు.. ఈ ఏడాది చివర్లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం భారతీ జనతా పార్టీ(బీజేపీ) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో నెల రోజుల తరువాత రైల్వే శాఖలో ఉన్నతాధికారిపై వేటు వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారతీయ రైల్వే చరిత్రలోఅత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని విపక్షాలను వేధిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నేత ఎంపీ శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు.