మణిపూర్ అంశంపై మాట్లాడటానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విపక్ష ఎంపీలకు సమయమిచ్చారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఇండియా ఎంపీలకు రాష్ట్రపతి సమయం కేటాయించారు.
నోబెల్ బహుమతి గ్రహీత, మయన్మార్ కీలక నేత ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్ష లభించింది. సైనిక ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షతో ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష తగ్గనుంది.
మణిపూర్ హింసపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు మంగళవారం కూడా విచారణను కొనసాగించింది. మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం మణిపూర్ పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
నేరస్థులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సమర్థించుకున్నారు. నేరస్థుల ఇళ్లపై ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు.
ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగించేలా కేంద్రం తీసుకుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును అధికార పక్షం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.