Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్ష.. తగ్గనున్న ఆరేళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aung San Suu Kyi: నోబెల్ బహుమతి గ్రహీత, మయన్మార్ కీలక నేత ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్ష లభించింది. సైనిక ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షతో ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష తగ్గనుంది. మయన్మార్ లో దేశ వ్యాప్తంగా నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా ఆంగ్ సాన్ సూకీతోపాటు, మాజీ అధ్యక్షుడు విన్ మైంట్ సహా ఏడు వేల మంది ఖైదీలకు అక్కడి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్షను ప్రసాదించింది. దీంతో ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష తగ్గనుందని ఆ దేశ అధికార ప్రతినిధి జా మిన్ తెలిపారు. గత వారం సూకీని జైలు నుంచి గృహనిర్భందానికి తరలించారు.
Read also: Trending News: కాబోయే భార్యకు 15 షరతులు.. ఎంత ఘోరంగా ఉన్నాయంటే..!
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఆంగ్ సాన్ సూకీని 19కిపైగా కేసుల్లో దోషిగా తేలుస్తూ మయన్మార్ కోర్టు ఆమెకు 33ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజా క్షమాభిక్షలో భాగంగా వీటిలో నాలుగు కేసుల్ని రద్దు చేశారు. తొలిసారిగా 1989లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఆమెను గృహనిర్భందంలో ఉంచారు. 1991లో ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి వరించింది. 2010లో ఆమెకు గృహనిర్భందం నుంచి విముక్తి లభించింది. 2015లో మయన్మార్‌లో జరిగిన ఎన్నకల్లో సూకీ పార్టీ విజయం సాధించడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ మరోసారి విజయం సాధించింది. 2021లో సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం చేపట్టింది. అప్పటి నుంచి మయన్మార్‌లో సైనిక పాలన సాగుతోంది. ఆ తర్వాత సూకీతోపాటు ఆమె అనుచరులపై ఎన్నికల్లో అవతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కోర్టు జైలు శిక్ష విధించింది. దాంతోపాటు మరికొన్ని కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. తాజాగా వాటిలో నాలుగు కేసులను కొట్టేశారు. మయన్మార్‌లో ఎమర్జెన్సీని మరోసారి పొడిగిస్తున్నట్లు సైనిక ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఎన్నికలను జాప్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధానిలో సోమవారం సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి (ఎన్‌డీఎస్‌సీ) ఎమర్జెన్సీని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!