జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థి మృతి అవమానకరమని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు ఉండాల్సిన అవసరముందన్నారు.
రాజకీయాల్లో ఉన్నవారు సేవ చేస్తారని ప్రజలు భావిస్తారు. ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజలకు సేవ చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధనవంతులు ప్రజాప్రతినిధులుగా ఎంపికవుతున్నారు.
ఐటీ ఉద్యోగుల జీతాలు లక్షల్లో ఉంటాయి. వారి జీతం లక్షల్లో ఉంటే... వారికి వచ్చే వ్యాధులు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది తీవ్రమైన వ్యాధుల భారిన పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
హానీ ట్రాప్ ద్వారా పురుషులను ఆకట్టుకొని తద్వారా డబ్బులు వసూలు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సెక్స్ రాకెట్‌లో భాగంగా మగవారి శృంగార వీడియోలు తీసి.. నిందితులు బెదిరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు రాష్ట్రంలో 74 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా రూ. 10వేల కోట్ల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన 11 మంది ఖైదీలకు శిక్షాకాలం పూర్తి కాకుండానే క్షమాభిక్ష పేరుతో గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు విచారణ నిర్వహించింది.