Floods And Landslides: దేశంలో భారీ వర్షాలు, వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయగా.. ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పర్యాటక ప్రాంతంగా, అందంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ నాశనం అయింది. ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా 2,038 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 335 జిల్లాలు ప్రభావితమయ్యాయి. వర్షాలు, వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడటం వల్ల 2,038 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో బీహార్‌లో అత్యధికంగా 518 మంది మరియు హిమాచల్ ప్రదేశ్ 330 మంది ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన డేటా ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 17 వరకు వర్షాలు మరియు వరదల సమయంలో 101 మంది అదృశ్యం కాగా.. 1,584 మంది గాయపడ్డారు. వర్షాలు, కొండచరియలు మరియు పిడుగుల కారణంగా 335 జిల్లాలు ప్రభావితమయ్యాయి. వాటిలో 40 మంది మధ్యప్రదేశ్, అస్సాంలో 30 మరియు ఉత్తరప్రదేశ్‌లో 27 జిల్లాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాలు, ఉత్తరాఖండ్‌లోని 7 జిల్లాల్లో కూడా రుతుపవనాల ప్రభావంతో కురిసిన వర్షాలు, వరదలు మూలంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Read also: NTR: ఎన్టీఆర్ మరి కాసేపట్లో చనిపోతాడనగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా?
వరదల కారణంగా 897 మంది మునిగిపోయారు. 506 మంది పిడుగుపాటు కారణంగా మరణించగా.. కొండచరియలు విరిగిపడి 186 మంది ప్రాణాలు కోల్పోయారు.
వర్షాకాలంలో వివిధ కారణాలతో మొత్తం 454 మంది మరణించారు. బీహార్, హిమాచల్‌ప్రదేశ్‌లతో పాటు గుజరాత్‌లో వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 165 మంది, మధ్యప్రదేశ్‌లో 138 మంది.. కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు 107 మంది.. ఛత్తీస్‌గఢ్‌లో 90 మంది, ఉత్తరాఖండ్‌లో 75 మంది మరణించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన మొత్తం 160 బృందాలను వివిధ రాష్ట్రాల్లో మోహరించారు. వాటిలో హిమాచల్ ప్రదేశ్‌లో 17, మహారాష్ట్రలో 14, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో ఒక్కొక్కటి 12, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో 10, ఉత్తరాఖండ్‌లో 9 బృందాలను మోహరించారు.