Eknath Shinde: ‘నేను మాట్లాడటం ప్రారంభిస్తే భూకంపమే’.. ఉద్ధవ్‌కు ఏక్‌నాథ్ షిండే వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాను మాట్లాడటం ప్రారంభిస్తే భూకంపం వస్తుందని అన్నారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు. దివంగత సేన నాయకుడు ఆనంద్ డిఘేకి ఏమి జరిగిందో తనకు తెలుసని కూడా అన్నారు. 2002లో రోడ్డు ప్రమాదంలో మరణించిన శివసేన నాయకుడు, అతని గురువు ఆనంద్ డిఘే గురించి ప్రస్తావిస్తూ.. ఏం జరిగిందో కూడా తనకు తెలుసునని, తానే ప్రత్యక్ష సాక్షినని షిండే అనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఆయన ప్రస్తావనను షిండే తీసుకురావడం చర్చనీయాంశమైంది.
ఉద్ధవ్ ఠాక్రే పేరెత్తకుండానే తిరుగుబాటు ఎమ్మెల్యేలను ద్రోహులు అనడంపైనా షిండే పరోక్షంగా స్పందించారు.. `కేవలం సీఎం కావడానికి బాలా సాహెబ్ సిద్ధాంతాలతో మీరు రాజీ పడలేదా? బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి సీఎం అవుతారు. ఇది ద్రోహం కాదా?` అని ఉద్ధవ్ ఠాక్రేను నిలదీశారు. బాలాసాహెబ్ థాక్రే అసలు వారసులం తామే అని పేర్కొన్నారు. ఇటీవలే తన వర్గంలో చేరిన బాలాసాహెబ్ కోడలు, మనవడు కూడా తనకే మద్దతుగా నిలిచారని షిండే చెప్పారు.
Also Read
Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన సీఎం ఏక్‌నాథ్ షిండే
వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీ చేసి మరోసారి అధికారం చేపడతామని షిండే ధీమా వ్యక్తం చేశారు. తన నేతృత్వంలోని శివసేన, బీజేపీ కలిసి మొత్తం 288 సీట్లకు గాను 200 స్థానాలు గెలుచుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!