India Vs Pakistan: జాతీయ పతాకాన్ని తీసుకునేందుకు నిరాకరించిన జై షా.. ఫ్యాన్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Vs Pakistan: జై షా.. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్.. అంతకు మించి కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా కుమారుడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు కొత్తగా వివాదాలకు కేంద్రబిందువు అయింది. జై షా చుట్టూ వివాదాలు ఇప్పుడిప్పుడే ముసురుకుంటోన్నాయి. దీనికి సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని ఆయన ఎదుర్కొనక తప్పక పోవచ్చు. బీసీసీఐ కార్యదర్శిగా ఆయన వివరణ ఇవ్వాల్సిందేనంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన వైఖరిని తప్పుపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి దాయాదుల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఆసియా కప్ టీ-20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు సెలబ్రిటీలే కాక చాలా మంది అభిమానులు దుబాయ్ వెళ్లారు. వీరిలో అమిత్ షా కుమారుడు జై షా కూడా ఉన్నారు. ఇక పాకిస్థాన్‌పై విజయం అనంతరం స్టేడియంలో ఉన్న భారతీయ అభిమానులు ఆనందోత్సాహాల మధ్య చప్పట్లు కొడుతూ.. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతీయా జెండాను పట్టుకుని అభివాదం చేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
Mukesh Ambani: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ!
ఈ క్రమంలో ఓ వ్యక్తి జై షాకు జాతీయ జెండా తీసుకెళ్లి ఇవ్వగా అతడు దాన్ని పట్టుకోవడానికి నిరాకరించాడు. నో చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలయ్యింది. ఇది చూసిన నెటిజన్లు మొన్నటి వరకు హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి భారతీయుడు ఇంటి మీద జెండాను ఎగురవేసి దేశంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేంద్ర మంత్రి కుమారుడివైన నువ్వు.. జెండా పట్టుకోవడానికి నిరాకరించావు.. ఇదేనా నీ దేశభక్తి.. సంస్కారం అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. జై షా వైఖరిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఆయనను ట్రోల్ చేస్తోన్నారు. తిరంగాను తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదంటూ నిలదీస్తోన్నారు. ఇదేనా మీ దేశభక్తి అంటూ నిలదీస్తోన్నారు. ప్రతి ఇంటి మీదా జాతీయ జెండాను ఎగువేయాలంటూ సలహాలను మాత్రం ఇస్తారు.. తాము మాత్రం దీన్ని పాటించరంటూ ధ్వజమెత్తుతున్నారు. విపక్షాలు కూడా దీనిపై మండిపడుతున్నాయి. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇదే దేశభక్తి అంటూ నిలదీస్తున్నారు.
If it was any non bjp leader who refused to hold the Indian Flag, the whole of BJP IT Wing would have called Anti National and the Godi Media would have day long debates on it ….
Luckily its Shahenshah's Son Jay Shah pic.twitter.com/zPZStr2I3D— Dr.Krishank (@Krishank_BRS) August 28, 2022
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?