America Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. హూస్టన్‌లో ఓ ఇంటికి సదరు దుండగుడు నిప్పంటించాడు. అందులో ఉన్న వారు బయటకు పరుగులు పెడుతుండగా.. వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీనితో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
Arvind Kejriwal: ఢిల్లీలో ఆపరేషన్ కమలం విఫలమైందని చెప్పేందుకే విశ్వాస తీర్మానం
అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించినట్లు సిటీ పోలీస్ చీఫ్ ట్రాయ్ ఫిన్నర్ వెల్లడించారు. అతనితో కలిపి మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. బాధితులందరూ 40-60 మధ్య వయస్సు గలవారేనని చెప్పారు. ఆ దుండగుడు 40 ఏళ్ల ఆఫ్రికన్ అమెరికన్ అని, అతను పూర్తిగా నలుపు రంగు దుస్తులు ధరించినట్లు ఆయన వెల్లడించారు. గత వారం అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.