Congress: త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీతో అమీతుమీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే ఆప్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌లో హామీల వర్షం గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో గుజరాత్ పలు హామీలను గుప్పించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద ‘పరివర్తన్ సంకల్ప్ ర్యాలీ’లో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ ప్రజలకు గాంధీ అనేక వాగ్దానాలు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హామీలను అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో వెల్లడించారు. పరివర్తన్ సంకల్ప్ సమ్మేళన్ పేరిట కీలక హామలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీలివే..
1. రూ.500కే గ్యాస్ సిలిండర్
2. 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం
3. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
4. రూ.3 లక్షల వరకు రైతు రుణమాఫీ
5. 3000 ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ఏర్పాటు
6. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం
7. పాల ఉత్పత్తిదారులకు లీటరుపై రూ.5 సబ్సిడీ
8. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు విధానానికి స్వస్తి. నిరుద్యోగులకు రూ.3,000 నిరుద్యోగ భృతి.
తాము గుజరాత్ ప్రజల కోసం పని చేస్తామని.. బీజేపీలాగా ఇద్దరు ముగ్గురు స్నేహితుల కోసం కాదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇదే కాంగ్రెస్ సంకల్పమని.. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఇక్కడి బీజేపీ ప్రభుత్వం అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తుంది, అయితే వారు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రతి రైతుకు రూ.3 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. గుజరాత్‌లో మేం అధికారంలోకి వస్తాం. ” అని రాహుల్ అన్నారు. గుజరాత్ డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ సోమవారం మండిపడ్డారు. ‘గుజరాత్ డ్రగ్స్‌కు కేంద్రంగా మారింది. ముంద్రా పోర్టు నుంచి డ్రగ్స్‌ను తరలిస్తారు కానీ మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. ఇది గుజరాత్ మోడల్.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
7. दुग्ध उत्पादकों को 1 लीटर पर ₹5 की सब्सिडी
8. सरकारी नौकरियों में कांट्रैक्ट सिस्टम बंद और युवाओं के लिए ₹3000 का बेरोज़गारी भत्ताहम गुजरात की जनता के लिए काम करेंगे, भाजपा की तरह 2-3 'मित्रों' के लिए नहीं।
ये हमारा संकल्प है और गुजरात की जनता कांग्रेस को जिताएगी।
— Rahul Gandhi (@RahulGandhi) September 5, 2022