British Prime Minister: బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ కన్జర్వేటివ్ నాయకత్వ రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను ఓడించారు. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీ ప్రచారంతో పాటు పోలింగ్ కూడా పూర్తయింది. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత విజేతను ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. నలభై ఏడేళ్ల లిజ్ ట్రస్ యూకే మూడవ మహిళా ప్రధాన మంత్రి కానున్నారు. ఆమె కన్జర్వేటివ్ సభ్యులందరి పోస్టల్ బ్యాలెట్ ద్వారా సునాక్‌ను ఓడించింది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై అవినీతి ఆరోపణలు రావడంతో సొంత పార్టీ నుంచే తిరుగుబాటు మొదలైంది. వరసగా 40కి పైగా మంత్రులు రాజీనామా చేశారు. వరుస రాజీనామాల తర్వాత జులై 7న బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టోరీ నాయకత్వ రేసు అనివార్యమైంది. ఈ పోరులో లిజ్‌ట్రస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలన్నీ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. సర్వేల అంచనాలను నిజం చేస్తూ మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా లిజ్ రికార్డు సృష్టించారు. లిజ్ ట్రస్ బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకొనేందుకు గడిచిన ఆరు వారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారంతో పాటు పార్టీలో అంతర్గతంగా పోలింగ్ జరిగ్గా.. తాజాగా తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో లిజ్ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా.. రిషి సునాక్‌కు 60,339 ఓట్లు వచ్చాయి. దీంతో దాదాపు 21వేల ఓట్ల తేడాతో లిజ్ ట్రస్ గెలుపొందారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్ ట్రస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని ప్రకటించారు.
Congress: గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీల వర్షం.. రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఇంకెన్నో..
లిజ్ ట్రస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌కు రెండు రోజుల పర్యటనను చేపట్టింది. తన పర్యటనలో భారత్‌తో భాగస్వామ్య ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. భవిష్యత్తు కోసం నిర్దేశించిన ప్రణాళికలపై ఇరు దేశాలు కలిసి పనిచేయాలని ట్రస్ నొక్కిచెప్పారు. గత ఏడాది మేలో రెండు దేశాల మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా భారతదేశం- యూకే భవిష్యత్ సంబంధాల కోసం రోడ్‌మ్యాప్ 2030 ప్రారంభించబడింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన మరో పర్యటనలో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కలిసి ట్రస్ రోడ్‌మ్యాప్ 2030కి సంబంధించి ఇప్పటివరకు సాధించిన పురోగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ మరియు వలసల ప్రాధాన్యతా రంగాలలో ఫలితాలను అందించడానికి ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేయడానికి అంగీకరించారు. జనవరి 2022లో ప్రారంభించినప్పటి నుండి రెండు ఉత్పాదక రౌండ్‌లు పూర్తయిన భారతదేశం-యూకే ఎఫ్‌టిఎ చర్చలలో గణనీయమైన పురోగతిని ఇరుపక్షాలు అభినందించాయి.