Peddireddy Ramachandrareddy: ఇసుకపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఇసుక కేటాయింపు పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న వారు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వచ్చని.. దీనితో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఇసుక విషయంలో అక్రమాలు అరికట్టేందుకు విజిలెన్స్ విభాగం పటిష్టంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ షాదీ తోఫా ప్రకటనను పక్కదారి పట్టించేందుకే ఇలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎం జగన్ సర్కారు 100 శాతం ఎన్నికల హామీలు అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదన్న ఆయన.. వైఎస్ భారతమ్మతో లింక్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నాన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి బంధువులు లిక్కర్ స్కాం సూత్రధారులని… ఉద్దేశపూర్వకంగా దీనిని వైఎస్ జగన్ కుటుంబీకులకు అంటగడుతున్నారని ఆయన ఆరోపించారు. సిగ్గుమాలిన వ్యక్తులే ఇలా కుటుంబీకులపై ఆరోపణలు చేస్తారని ధ్వజమెత్తారు. తమపై రాజకీయాలు చేయండి ఎదుర్కొంటామని… వైఎస్ కుటుంబీకులను లాగితే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు.
Minister Venugopal Krishna: చంద్రబాబు కుటిల కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారు..
తెలంగాణ నుంచి ఏపీకి ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందన్న ఆయన.. దీనిపై పోరాడుతున్నామన్నారు. ఈ బకాయిలు ఎగ్గొట్టడానికే 1700 కోట్లు మాకే ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిన్న కోర్టును ఆశ్రయించిందని.. లీగల్‌గా ఎదుర్కొంటామన్నారు. ఈ నెల 22న సీఎం జగన్ కుప్పం వస్తున్నారని.. మూడో విడత చేయూత పథకంను సీఎం ఇక్కడ లబ్ధిదారులకు విడుదల చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.