Malikireddy Rajagopal Reddy: నంద్యాల టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలను అనుకూలంగా మలుచుకుని గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసిన సంగతి తెలిసిందే. . తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో మరింత పట్టుబిగించింది అధికారపార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్. అప్పట్లో టీడీపీ.. ఇప్పుడు వైసీపీ అన్నట్టుగా గ్రూప్ పాలిటిక్స్ మారిపోయాయి. ఇక్కడ అధికారపార్టీని ఓ రేంజ్‌లో వర్గపోరు వెంటాడుతోంది. స్వపక్షమే శత్రుపక్షంగా మారి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శిబిరాన్ని ఉలిక్కి పడేలా చేస్తోందని సమాచారం. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఫ్యామిలీపై వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Peddireddy Ramachandrareddy: ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు
శిల్పా ఫ్యామిలీ రోజుకొక పార్టీని మారిందని ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఉంటూ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్‌గా ఉన్న శిల్ప మోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్ మృతి తర్వాత జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జగన్‌ను , రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీని నమ్ముకుని పార్టీ మారలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నాం కానీ న్యాయం కోసం పోరాడుతానన్నారు. లాభాపేక్ష లేకుండా కేబుల్ ప్రసారాలు ఇవ్వాలనుకున్నా .. కానీ రాజకీయంగా మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.