Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలను ఉంచాలన్న తన డిమాండ్‌ను రెట్టింపు చేశారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఇది సహాయపడుతుందని, చిత్రాలతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేయాలని ఆయన గురువారం ప్రధానిని కోరారు. మహాత్మా గాంధీతో పాటు లక్ష్మీ దేవి, గణేష్‌ల చిత్రాలను కరెన్సీ నోట్లపై ఉంచాలని130 కోట్ల మంది భారతీయుల తరపున అభ్యర్థిస్తూ నరేంద్ర మోడీకి అధికారికంగా లేఖ రాశారు. “దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అధ్వాన్నమైన దశలో ఉంది, స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న పేద దేశంగా పేరుపొందింది. ఒక వైపు, పౌరులు కష్టపడి పనిచేయాలి, కానీ మన ప్రయత్నాలకు దేవుని ఆశీర్వాదం కూడా అవసరం. ఫలించండి.” అని హిందీలో రాసిన తన లేఖను ఆయన ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు.
Vladimir Putin: మోడీ గొప్ప దేశ భక్తుడు.. ప్రశంసల జల్లు కురిపించిన పుతిన్
తాను చేస్తు్న్న ప్రజల నుంచి విపరీపతమైన మద్దతు ఆయన గురువారం మీడియా సమావేశంలో అన్నారు. దీనిని త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. అన్ని నోట్లను మార్చమని తాను చెప్పడం లేదని, కానీ ప్రతి నెల విడుదల చేసే అన్ని తాజా నోట్లలో వాటి చిత్రాలు ఉండాలన్నారు. కరెన్సీ నోటుపై గణేష్ బొమ్మ ఉన్న ముస్లిం దేశమైన ఇండోనేషియా గురించి ఆయన ప్రస్తావించారు. ఇండోనేషియా చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేమన్నారు. ఇండోనేషియాలోని 20,000 రూపాయల నోటుపై గణేష్ చిత్రం ముద్రించబడిందన్నారు. ఈ డిమాండ్ నేపథ్యం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ విరుచుకుపడింది. రాజకీయ లబ్ధి కోసమే కేజ్రీవాల్ ఈ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది.