DMK Leader on Khushboo: సినీ నటి ఖుష్బూ పెద్ద ఐటమ్.. డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK Leader on Khushboo: సినీ నటి ఖుష్బూపై డీఎంకే నేత సైదైయ్ సాదిక్ వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీలోని ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఖుష్బూ పెద్ద ఐటమ్ అంటూ మాట్లాడారు. అమిత్ షా తలమీద వెంట్రుకైనా మొలుస్తేందేమో కానీ.. తమిళనాడులో కమలం మాత్రం వికసించదన్నారు. డీఎమ్‌కే నేత మాటలపై సినీ నటి ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Piyush Goyal: ప్రధాని మోడీ విజన్‌తో పనిచేస్తున్నారు.. భారత్ దూసుకుపోతోంది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నానని డీఎంకే సీనియర్ నాయకురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి కనిమొళి అన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని ఆమె చెప్పారు. ప్రముఖ నటి, భాజపా నేత ఖుష్బు సుందర్ ట్విటర్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ‘‘ మహిళలను పురుషులు దుర్భాషలాడారంటే….వారు ఎలాంటి వాతావరణంలో పుట్టిపెరిగారో అర్థమవుతుంది. ఇలాంటివారే మహిళల గర్భాన్ని అవమానిస్తారు. ఇదేనా ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిడ సంస్కృతి? అని ట్విటర్ వేదికగా కనిమొళి విమర్శలు గుప్పించారు.
అనంతరం డీఎంకే నేత సైదైయ్ సాదిక్ కూడా క్షమాపణలు చెప్పారు. ఏ నాయకుడిని బాధపెట్టాలని తాను ఉద్దేశించలేదని అన్నారు. కుష్బూతో సహా ఏ నాయకుడిని బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని సాదిక్ అన్నారు. అయితే బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీఎన్‌బీజేపీ చీఫ్ అన్నామలై డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అన్నారని.. జర్నలిస్టులను కోతులతో పోల్చాడని.. ఈ బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని అని సైదైయ్ సాదిక్ ప్రశ్నించారు. నమిత, ఖుష్బు సుందర్, గౌతమి, గాయత్రి రఘురామన్‌లను ఉద్దేశించి డీఎంకే నేత సైదైయ్ సాదిక్ తమిళనాడులో నటిగా మారిన బీజేపీ నేతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది.
I apologise as a woman and human being for what was said.This can never be tolerated irrespective of whoever did it,of the space it was said or party they adhere to.And I’m able to openly apologise for this because my leader @mkstalin and my party @arivalayam don’t condone this. https://t.co/FyVo4KvU9A
— Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) October 27, 2022
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!