Sudhir Suri: పంజాబ్‌లో శివసేన నాయకుడు సుధీర్ సూరి దారుణ హత్యకు గురయ్యారు. అమృత్‌సర్‌లో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్చిచంపిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. శుక్రవారం ఓ ఆలయం వెలుపల శివసేన నాయకుడు సుధీర్ సూరి, మరికొందరు కలిసి నిరసన తెలుపుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. స్థానిక దుకాణదారుడు తెలిపిన వివరాల ప్రకారం పిస్టల్ నుండి కనీసం ఐదు షాట్లు కాల్చారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసు కమిషనర్ తెలిపారు.
ఇటీవల ఓ ఆలయ ప్రాంగణం వెలుపల విరిగిన విగ్రహాలు చెత్తకుప్పలో కనిపించడంతో శివసేన నాయకులు ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వారికి మద్దతు తెలుపుతూ సుధీర్ ఆ నిరసనల్లో పాల్గొనగా.. గుంపులో నుంచి వచ్చిన కొందరు సుధీర్‌పై కాల్పులు జరిపారు. దీంతో సుధీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడిని శివసేన నాయకులు పట్టుకోగా.. అక్కడే ఉన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ వర్గానికి వ్యతిరేకంగా సుధీర్ వ్యాఖ్యలు చేయడంతో… ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరగా మారగా.. అతనికి బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు భద్రత కూడా కల్పించారు. కానీ నిందితుడు వెంటవెంటనే కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
Crime News: అశ్లీల సైట్లకు బానిసై అఘాయిత్యం.. మైనర్‌పై బాలుడు అత్యాచారం
మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, కులపరమైన వ్యాఖ్యలు చేసినందుకు సదరు నేతపై పలు కేసులు కూడా ఉన్నాయి. పలు సందర్భాల్లో అరెస్టు అయి జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ ఏడాది ప్రారంభంలో మాన్సా జిల్లాలో గాయకుడు సిద్ధూ మూసేవాలా కాల్చి చంపబడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన రెండో అతిపెద్ద కాల్పుల ఘటన ఇది.
https://twitter.com/MrsGandhi/status/1588493888763101184