Imran Khan Ex Wives: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల వజీరాబాద్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. ఇమ్రాన్‌కు ప్రాణహాని తప్పడంతో పీటీఐ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనను ఇమ్రాన్ మాజీ భార్యలు ఖండించారు. ఈ ఘటనలో ఇమ్రాన్ స్వల్ప గాయాలతో బయటపడడంతో మొదటి భార్య జెమీమా గోల్డ్ స్మిత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కాల్పుల గురించి తెలియగానే భయపడ్డామని ఆమె అన్నారు. ఇమ్రాన్‌పై కాల్పులు జరపకుండా ఆపిన వ్యక్తిని ఆమె హీరోగా కొనియాడారు. తన కుమారులకు తండ్రిని మిగిల్చిన ఆ వ్యక్తికి రుణపడి ఉంటామన్నారు.
Gold Seized: ఏం తెలివిరా నాయనా.. సూట్‌కేస్ లైనింగ్‌లో కేజీకి పైగా బంగారం
బ్రిటన్ దేశంలో సంపన్న కుటుంబానికి చెందిన జెమీమా గోల్డ్ స్మిత్‌ను ఇమ్రాన్ 1995లో పెళ్లి చేసుకోగా.. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 9 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం వారిద్దరు విడాకులు తీసుకున్నారు. అనంతరం బ్రిటన్‌కు చెందిన టీవీ యాంకర్ రెహామ్ ఖాన్‌ను ఇమ్రాన్‌ఖాన్ వివాహం చేసుకున్నారు. వారి వివాహ బంధం 10 నెలలకే ముగిసింది. తన మాజీ భర్త ఇమ్రాన్‌పై కాల్పులు జరిగాయని తెలియదగానే రెహామ్ ఖాన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఇమ్రాన్, ఇతర నేతలపై కాల్పులు జరగడం దిగ్భ్రాంతి కలిగించిందని రెహామ్ ఖాన్ తెలిపారు. నేతల భద్రతలను ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు.