Kantara Star Rishabh Shetty: ‘కాంతార’ స్టార్‌ను కలిసిన మిస్టర్ 360
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara Star Rishabh Shetty: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కాంతార’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కన్నడలో ఆధ్యాత్మిక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను కేజీఎఫ్ మూవీని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మించడం గమనార్హం. రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఇతర భాషల్లోకి కూడా అనువదించి విడుదల చేశారు. ఇక తెలుగు, హిందీ భాషల్లో కూడా సినీ అభిమానులు ఈ సినిమాకు జేజేలు పలుకుతున్నారు.
కాగా దేశవ్యాప్తంగా కాంతార చిత్రం ప్రమోషన్స్ చేసే పనిలో నిమగ్నమైన రిషబ్ శెట్టిని దక్షిణాఫ్రికా క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఏబీ డివిలియర్స్ కలిశాడు. రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏబీ డివిలియర్స్‌తో ఉన్న ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోలో డివిలియర్స్, రిషబ్ శెట్టితో కలిసి కాంతారా అని చెబుతున్నట్లు కనిపించింది. రిషబ్ షేర్ చేసుకున్న ఈ వీడియోకు క్యాప్షన్ ఈ విధంగా ఇచ్చారు. “ఇది ఒక మ్యాచ్. ఈ రోజు మిస్టర్ 360ని కలుసుకున్నాను. సూపర్‌హీరో మళ్లీ బెంగుళూరుకు తిరిగి వచ్చాడు” అని రిషబ్ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు.అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్ ఇప్పుడు ఈ కాంతారా ప్రమోషనల్ వీడియోలో కనిపించేసరికి, అభిమానులు వీడియోని షేర్లు చేస్తూ వారి అభిమానాన్ని తెలుపుతున్నారు. ‘ఇద్దరు స్టార్లు కలిశారు’ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
Yashoda: సమంత అనారోగ్యం గురించి నాకప్పుడు తెలియదు: ఉన్ని ముకుందన్
కాంతార సినిమా కన్నడ, హిందీ వెర్షన్‌లలో వరుసగా సెప్టెంబర్ 30న, అక్టోబర్ 14న విడుదలైంది. చిత్రానికి రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ కుమార్.జి కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష కూడా ఇచ్చారు. సినిమాను బాగా రూపొందించారని ఆమె ప్రశంసించారు. ‘కాంతారా’ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి