India Lockdown: ఇండియా లాక్‌డౌన్.. ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Lockdown: కరోనా అనే పేరు వినపడితేనే యావత్ ప్రపంచం వణికిపోయిన రోజులున్నాయి. ఎంతో మంది ఆత్మీయులను, ఆప్తులను పొట్టన పెట్టుకుని దేశంలో ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది ఈ మహమ్మారి. ఇంకా ఇప్పటికీ కరోనా అంటే వణికిపోతున్నారు. ఎంతలా అంటే లాక్‌డౌన్ అని పేరు వింటేనే.. ఏంటీ మళ్లీ లాక్‌డౌనా? అంటూ భయపడిపోతున్నారు. మళ్లీ ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ట్విటర్‌లో ‘ఇండియా లాక్‌డౌన్’ యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ‘ఇండియా లాక్‌డౌన్’ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరో కొవిడ్ వేవ్ వస్తోందా అంటూ చాలా మందిలో భయం నెలకొంది. ఇది చూసిన నెటిజన్లు ఇండియాలో మళ్లీ లాక్‌డౌనా? అంటూ భయపడిపోతున్నారు. అసలు విషయం తెలిశాకా హమ్మయ్యా.. అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. అది సినిమా పేరు అని తెలిశాకా.. రిలాక్స్ అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. అవును నిజమేనండి.. ‘ఇండియా లాక్‌డౌన్’ అనే టైటిల్‌తో దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వంలో సినిమా వస్తోంది. గతంలోని కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో దేశంలోని లాక్‌డౌన్ పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ‘ఇండియా లాక్‌డౌన్’ పేరిట పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Elon Musk Twitter: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం..! ట్విట్టర్ ఖాతా ఉంటే డబ్బు కట్టాల్సిందే..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కరోనా నాటి పరిస్థితులను ప్రతిబింబిచేలా వస్తున్న చిత్రం ‘ఇండియన్ లాక్‌డౌన్’. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వలస కూలీలు అనుభవించిన వేదన, వేశ్యవృత్తి వారిపై కరోనా ప్రభావం లాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ట్రైలర్‌లో చూపించారు. శ్వేత బసు ప్రసాద్, ప్రతీక్ బబ్బర్, సాయి తమంకర్, ప్రకాశ్ బెలవాడి, అహన్‌కుమ్రాలు కీలకపాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ జీ5 వేదికగా డిసెంబరు 2న స్ట్రీమింగ్ కానుంది.
#IndiaLockdown is just a movie name relax guys pic.twitter.com/Y1VWOfe79I
— 厕拍 厠拍廁拍偷拍厕所偷拍女厕所偷拍厠所偷拍女厠所偷拍廁所偷拍女廁所偷拍 (@Elza33099071) November 9, 2022
https://twitter.com/ApJehra/status/1590024711878365186
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!