Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుత శతకం
- 51 బంతుల్లో 102 పరుగులు చేసిన గుర్బాజ్
- భారత అభిమానుల హృదయాలను గెలుచుకున్న గుర్బాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahmanullah Gurbaz Dedicates His Century to Indian Fans: శనివారం భారత్‌తో ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ స్టార్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుత శతకంతో మెరిశాడు. జట్టు ఓడిపోయినప్పటికీ.. అతడి మెరుపు ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంది. కేవలం 51 బంతుల్లో 102 పరుగులు చేసిన గుర్బాజ్.. భారత్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. మ్యాచ్ అనంతరం గుర్బాజ్ చేసిన వ్యాఖ్యలు భారత అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. భారత్‌ను తన రెండో ఇల్లుగా అభివర్ణించిన అతడు.. ఇక్కడ పరుగులు చేయడం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని చెప్పాడు. భారత జట్టు లాంటి బలమైన ప్రత్యర్థిపై సెంచరీ చేయడం తనకు ఎంతో గర్వకారణమని గుర్బాజ్ పేర్కొన్నాడు.
భారత్ నా రెండో ఇల్లు:
‘ఈ ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకమైనది. భారత్ ఎప్పుడూ నా రెండో ఇల్లులా అనిపిస్తుంది. ఇక్కడ పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. భారత్ వంటి గొప్ప జట్టుపై సెంచరీ సాధించడం గర్వకారణం. ఈ శతకాన్ని భారత అభిమానులకు అంకితం చేస్తున్నాను’ అని రహ్మనుల్లా గుర్బాజ్ భావోద్వేగంగా తెలిపాడు. భారత అభిమానులు అఫ్గానిస్థాన్ క్రికెట్‌కు ఎప్పుడూ అండగా నిలిచారని గుర్తు చేశాడు. ‘భారత అభిమానులు మాపై ఎప్పుడూ ఎంతో ప్రేమ చూపించారు. అఫ్గానిస్థాన్ క్రికెట్ ఎదుగుదలకు వారి మద్దతు ఎంతో విలువైనది. మేము, భారత ప్రజలు మంచి స్నేహితుల్లా ఉంటాం. ఆ బంధం మాకు చాలా ముఖ్యమైనది’ అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
- US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
గంభీర్ సర్ సూచనలు ఇచ్చాడు:
తన సెంచరీ ఇన్నింగ్స్ వెనుక భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలు చాలా ప్రభావం చూపించాయని గుర్బాజ్ చెప్పాడు. ‘ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడినందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ మా జట్టు ఓడిపోయినందుకు నిరాశకు గురయ్యా. వ్యక్తిగతంగా నా ఆట మెరుగైంది. నెట్స్‌లో బాగా శ్రమించా. ఈ ఇన్నింగ్స్ క్రెడిట్ గౌతమ్ గంభీర్‌కే దక్కుతుంది.టెస్టు మ్యాచ్ తర్వాత గంభీర్‌తో సంభాషించా. అది నాకు బాగా ఉపయోగపడింది. షాట్ల ఎంపికలో ఎలా మెరుగు కావాలని అడిగితే.. మంచి సూచనలు ఇచ్చాడు. నెట్స్‌లో అదే ప్రాక్టీస్ చేశా, ఇప్పుడు వచ్చింది. గంభీర్ సర్‌కు నా కృతజ్ఞతలు చెబుతున్నా’ అని గుర్బాజ్ పేర్కొన్నాడు.
బాధ్యతాయుతంగా ఆడిన గుర్బాజ్:
ధర్మశాల వన్డేలో అఫ్గానిస్థాన్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో గుర్బాజ్ బాధ్యతాయుతంగా ఆడాడు. అదే సమయంలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. హష్మతుల్లా షాహిదీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. జట్టు విజయాన్ని అందుకోలేకపోయినా.. భారత అభిమానులపై గుర్బాజ్ వ్యక్తం చేసిన ప్రేమ, కృతజ్ఞతలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని వ్యాఖ్యలు రెండు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ఉన్న స్నేహపూర్వక బంధానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయి.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!