Former Miss World Tollywood Entry: మిస్ ఇండియా మానుషి చిల్లర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోతో ఆమె జోడి కట్టబోతున్నట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌తో ఆమె జట్టు కట్టనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్‌లో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడీగా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఎంపికైనట్లు తెలుస్తోంది.
Minister Roja: బర్త్ డే వేళ శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుండగా.. ఇందులో జెట్ పైలెట్‌గా వరుణ్‌తేజ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘పృథ్వీరాజ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మానుషి.. వరుణ్‌తేజ్‌కి జోడీగా నటించేందుకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. ‘పృథ్వీరాజ్’ సినిమాలో రాణి సంయోగిత పాత్రలో మానుషి చిల్లర్ నటనకు ప్రశంసలు దక్కాయి. 2017లో మిస్ ఇండియాతో పాటు మిస్ వరల్ట్ టైటిల్స్‌ను మానుషి చిల్లార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.