Casino Case: ‘చీకోటి’ క్యాసినో కేసులో ఈడీ దూకుడు.. ఇప్పటికే పలువురికి నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Casino Case: తెలంగాణలో ‘చీకోటి’ క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈడీ విచారణ రాజకీయ వేడిని పెంచుతోంది. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్న నేతల్లో వణుకు మొదలైంది.
ఇప్పటికే బుధవారం మంత్రి తలసాని సోదరులైన మహేష్, ధర్మేంద్రలను దాదాపు 10గంటల పాటు ఈడీ విచారించింది. క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలు, మనీలాండరింగ్, హవాలా చెల్లింపులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. శుక్రవారం వీళ్లిద్దరినీ మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ వైద్యులు అంకాలజిస్ట్ వంశీకి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు పంపించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గురునాథ్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎల్, రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. హవాలా చెల్లింపులు, మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను గతంలో నాలుగు రోజులపాటు ఈడీ విచారించింది. నేడు, రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.
Also Read
Mysuru Bus stop Isuue: మసీదు డోమ్ ఆకారంలో ఉన్న బస్టాప్ కూల్చేయాలి.. ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు
క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ కుమార్‌తో సంబంధాలున్న పలువురిని ఈడీ విచారిస్తోంది. క్యాసినో కేసులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయవేత్తలకు ప్రమేయం ఉందని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు భావిస్తున్నారు. అనుమానం ఉన్న వారికి చెందిన నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దీంతో చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్న రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!