FIFA World Cup 2022: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ మేనియా కేరళ, కోల్‌కతాలను ఊపేస్తోంది. కేరళలో ఎక్కడ చూసినా రొనాల్డో నిలువెత్తు కటౌట్లు, మెస్సీ ఫ్లెక్సీలు, నెయ్‌మార్ బ్యానర్లు, ప్రపంచ కప్ ట్రోఫీలు దర్శనమిస్తున్నాయి. అభిమాన ఆటగాళ్ల జెర్సీలు ధరించి అభిమానులు ఫుట్‌బాల్‌పై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. వీధుల్లో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఓ వైపు ఆటగాళ్ల కటౌట్లు.. మరోవైపు భారీ బ్యానర్లు.. ఇంటికి అభిమాన దేశాల రంగులు.. ఒంటిపై జెర్సీలు.. ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ ప్రారంభంతో దేశంలో సందడి నెలకొంది. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే అభిమానుల సందడితో కేరళ, కోల్‌కతాల్లో సాకర్ ఫీవర్ ఊపేస్తోంది. కేరళలోని చాలా ప్రాంతాల్లో 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ సందడే నెలకొంది. అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగల్ దేశాల అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. పతనంతిట్ట జిల్లాలోని మల్లప్పుజస్సేరి గ్రామంలో.. అభిమాన ఆటగాళ్ల జెర్సీలు ధరించడమే కాకుండా ఇళ్లకు అర్జెంటీనా, బ్రెజిల్ రంగులను వేశారు. అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల అభిమానులు ఈ ఏడాది.. విజయంపై పందేలు కాస్తున్నారు.
కేరళలోని కాసరగోడ్‌లో కూడా ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీ రొనాల్డోల భారీ కటౌట్‌లతో పాటు ఖతార్ పాలకుడు తమీమ్ బిన్ హమద్ అల్ థానీ కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. అర్జెంటీనా, పోర్చుగల్‌ల అభిమానులు తమ అభిమాన జట్ల జెర్సీలను ధరించి సందడి చేశారు. మ్యాచ్‌లను వీక్షించడానికి భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. కొచ్చిలోని ఓ గ్రామంలో 23 లక్షల రూపాయలు వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేసిన అభిమానులు దానికి అభిమాన దేశాల రంగులు వేశారు. ఆ ఇంట్లో భారీ తెరను ఏర్పాటు చేసి మ్యాచ్‌లు వీక్షించే ఏర్పాట్లు చేశారు.
Wanaparty Road Accident: దారుణం.. చెరుకు ట్రాక్టర్ ను వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు
కోల్‌కతా కూడా ఫుట్‌బాల్ ఫీవర్ పట్టుకుంది. నగరంలోని అనేక ప్రాంతాలు జట్ల జెండాలు, అభిమాన ఆటగాళ్ల పోస్టర్‌లతో అలంకరించబడ్డాయి.కోల్‌కతాలోని అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ ప్రపంచ కప్‌లో పాల్గొనే అర్జెంటీనా, ఇతర దేశాల జెండాలు, పోస్టర్‌లతో అలంకరించబడింది. నగరంలో పలు చోట్ల జెయింట్ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాదు, వీధుల్లో లియోనెల్ మెస్సీ, డియెగో మారడోనాల పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు నగరంలోని సాకర్ అభిమానుల ఉత్సాహాన్ని వర్ణిస్తాయి.
కోలాహలాల మధ్య ఫిఫా వరల్డ్ కప్ 2022 నవంబర్ 20న ఖతార్‌లో ప్రారంభమైంది. డిసెంబర్ 18 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లోని 64 మ్యాచ్‌లకు ఖతార్ అంతటా ఎనిమిది స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఐదు సమాఖ్యల నుండి మొత్తం 32 జట్లు పోటీ పడుతున్నాయి. 29 రోజుల వ్యవధిలో 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. జట్లు ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, ఇరాన్, అమెరికా, వేల్స్, అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా, స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్, బెల్జియం, కెనడా , మొరాకో, మరియు క్రొయేషియా, బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్, పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే,దక్షిణ కొరియాలు పాల్గొంటున్నాయి.
The love for football in India is very real…♥️
World Cup fever is on🔥
📹: @AdwaidCs #FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/2SLs7YUXFT
— Olympic Khel (@OlympicKhel) November 16, 2022