Vijay Diwas: విశాఖ సాగర తీరంలో తూర్పు నౌకాదళం ఘనంగా విజయ్ దివస్‌ను నిర్వహించింది. భారత సైన్యం ప్రాణాలకు తెగించిం 1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయ్ దివస్‌ను జరుపుకోవడం ఆనవాయితీ. శత్రువుల మీద విజయం సాధించి 1971 డిసెంబర్ 16న సైనికులు జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా డిసెంబర్ 16న త్రివిధ దళాలు విజయ్ దివస్‌ను నిర్వహిస్తాయి.
ఈ సందర్బంగా విజయ్ దివస్‌ను విశాఖపట్నంలో తూర్పు నౌకాదళం ఘనంగా నిర్వహించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావెల్ ప్రాజెక్ట్ వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్.. విక్టరీ ఎట్ సీ వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి మౌనం పాటించారు. నౌకాదళం సాధించిన విజయానికి కారకులై యుద్ధంలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. భారత నౌకాదళ వీరులకు స్మారక వందనాన్ని నౌకాదళ సిబ్బంది సమర్పించారు.
High Court: టీటీడీ ఈవోకు హైకోర్టులో ఊరట.. జైలుశిక్ష, జరిమానాపై స్టే
1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. చివరకు భారత సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్ అవతరణకు అండగా నిలిచింది. ఈ సమయంలో సుమారు 93వేల పాకిస్థాన్ సైనికులు భారత సాయుధ బలగాల ముందు లొంగిపోయారు. ఆ విజయానికి గుర్తుగా భారత్‌లో ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను నిర్వహిస్తారు.