Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్!
- వైసీపీ నేత అంబటి రాంబాబుకి బెయిల్
- సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారన్న కేసులో బెయిల్
- 2023 సత్తెనపల్లి పీఎస్‌లో నమోదైన కేసులో అంబటికి బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో మరోసారి ఊరట లభించింది. సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను గుంటూరు జిల్లా కోర్టు బుధవారం తిరస్కరించింది. అంబటి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే అంబటి రాంబాబుపై నమోదైన మరో రెండు కేసుల్లో కూడా బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి.. తాజాగా వచ్చిన బెయిల్ ఆర్డర్‌తో విడుదల కానున్నారు. కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు అందగానే.. అధికారిక ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన జైలు నుంచి రిలీజ్ కానున్నారు. అంబటిపై నమోదైన కేసుల్లో ఒకటి సీఎం నారా చంద్రబాబు నాయుడుపై దూషణల ఆరోపణలకు సంబంధించినది కాగా.. మరొకటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలకు సంబంధించినది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన కీలక నేత అయిన అంబటి రాంబాబు వరుస కేసుల్లో బెయిల్ పొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనపై నమోదైన ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగా.. బెయిల్ మంజూరు కావడం ఆయనకు తాత్కాలిక ఊరటనిచ్చింది.
Also Read
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?