Man Kills PhD Student: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత తరచుగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి యజమాని ఇంట్లో అద్దెకు ఉండే పీహెచ్‌డీ విద్యార్థిని దారుణం హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. ఈ దారుణ ఘటన రెండు నెలల క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు నెలలకు క్రితం జరిగిన హత్య కేసులో తన ఇంట్లో ఉండే అంకిత్ ఖోకర్‌ను చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాల్వలో విసిరిన యూపీలోని ఘజియాబాద్ జిల్లాలోని మోడీనగర్‌కు చెందిన ఉమేష్ శర్మ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కోటి రూపాయల అత్యాశతో పీహెచ్‌డీ విద్యార్థి అంకిత్‌ను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇంటి యజమానిని మాత్రమే కాకుండా హంతకుడి స్నేహితుడైన పర్వేష్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ సంఘటన అక్టోబర్ 5న రాత్రి జరిగింది. నిందితుడి ఇంటి నుంచి మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన రంపాలు, కాలిపోయిన బట్టలు,అంకిత్ జుట్టు,రక్తం మరకలు కనుగొనబడ్డాయి. ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.
యూపీలోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన అంకిత్ ఖోకర్ తల్లిదండ్రులు మరణించినప్పటి నుండి ఒంటరిగా నివసిస్తున్నాడు. అతను లక్నోలోని ఒక విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. అంకిత్ ఖోకర్ ఫోన్‌కు అతని స్నేహితులు మూడు వారాల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కేవలం మెసేజ్‌లు మాత్రమే చేస్తున్నాడు. దీంతో ఖోకర్ ఘజియాబాద్ చేరుకున్నారు. ఖోకర్ కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. సందేశాలు మాత్రమే రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు.. అక్టోబర్ 5న రాత్రి అంకిత్ ఖోకర్‌ను హత్య చేసినట్లు కనుగొన్నామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మోడీనగర్‌కు చెందిన ఉమేష్ శర్మ అనే వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశారు. అంకిత్ ఖోకర్ కొద్ది నెలల క్రితం బాగ్‌పత్‌లోని తన పూర్వీకుల భూమిని విక్రయించాడు. అతనికి భూమి అమ్మగా రూ.1 కోటి వచ్చాయి. వాటిపై కన్నేసిన ఉమేష్ శర్మ.. తనకు రూ.40 లక్షలు అప్పు ఇవ్వాల్సిందిగా ఖోకర్‌ను కోరాడు. దీంతో ఖోకర్ ఉమేష్ కు రూ.40 లక్షలు ఇచ్చాడు.
Woman Marries Lord Vishnu : మహా విష్ణువును పెళ్లి చేసుకున్న మహిళ
అక్టోబరు 5న అంకిత్ ఖోకర్‌ను గొంతుకోసి హత్య చేసినట్లు కనుగొన్నామని పోలీసులు చెప్పారు; అప్పుడు ఒక రంపాన్ని ఉపయోగించి శరీరాన్ని కనీసం మూడు భాగాలుగా నరికి, వాటిని అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేశాడని వెల్లడించారు. అతను ఒక భాగాన్ని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ వద్ద ఉన్న కాలువలో, మరొక భాగాన్ని ముస్సోరీ కాలువలో, కొంత భాగాన్ని ఎక్స్‌ప్రెస్‌వేపై పడవేశాడు. భాగాలు దొరకాల్సి ఉంది. హత్య చేసిన తర్వాత కూడా బాధితుడి ఖాతాల నుంచి రూ.20 లక్షలు విత్‌డ్రా చేశాడు. మరిన్ని డబ్బుల కోసం తన స్నేహితుడు ప్రవేశ్‌కి ఇచ్చి ఉత్తరాఖండ్‌లో విత్‌డ్రా చేయమని చెప్పాడు. బాధితుడి మొబైల్ ఫోన్ కూడా తీసుకోమని చెప్పాడు.