భారత్ జోడో యాత్రపై కూడా కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కోవిడ్ ఆందోళనకర పరిస్థితులు ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లేఖ రాశారు.
బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈడీ ఛార్జిషీట్‌లో 28 సార్లు తన పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా? అంటూ మంత్రి కేటీఆర్ మంగళవారం బండి సంజయ్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దొంగలు బడ్డ ఆరునెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకు అంటూ మండిపడ్డారు.
షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనే జంటగా నటించి 'పఠాన్' సినిమాలోని 'బేషరం రంగ్' పాట వివాదం ఇంకా చల్లారలేదు. ఆ పాటలో దీపిక ధరించిన కాషాయ రంగు బికినీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యకు చెందిన సాధువు ఛవానీ జగద్గురువు పరమహంస ఆచార్య మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
2021లో దేశంలో ప్రతిరోజూ 115 మంది రోజువారీ వేతన జీవులు, 63 మంది గృహిణులు తమ జీవితాలను ముగించుకున్నారని.. దేశంలో మొత్తం 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలియజేశారు.
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది. రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక సంస్థ త్వరలో 4,661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 31లోపు ఈ నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో పంచాయతీపై అధిష్ఠానం సీరియస్‌గానే నజర్ పెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను పరిశీలకుడిగా పంపిస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్‌కు రాబోతున్నారు. అధిష్ఠానం జోక్యంతో సీనియర్ నేతల సమావేశం వాయిదా పడింది.
విదేశాల్లో కరోనా విజృంభిస్తుండడంతో భారత్ అప్రమత్తమైంది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో ఎంపీ జోగినపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మీద ప్రత్యేక వ్యాసాన్ని డిసెంబర్ సంచికలో ప్రచురించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్-బిల్డింగ్ బెటర్ టుమారో పేరిట ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించింది.
తల్లీపిల్లల సంరక్షణకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం విజయవంతంగా అమలవుతుండగా.. కొత్తగా ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్ల’ను రూపొందించింది. గర్భిణుల్లో రక్తహీనత అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో తొలి విడతగా వీటిని పంపిణీ చేయనున్నారు.