మంచు తుఫాన్ ధాటికి అమెరికా అల్లకల్లోలం అవుతోంది. అమెరికాతో పాటు కెనడా కూడా మంచు తుపాన్ ధాటికి వణుకుతోంది. విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. ఈ శీతల గాలుల ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి.
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుంచి జరిగే హత్ సే హాత్ జోడో కార్యక్రమానికి రాష్ట్రాల పరిశీలకులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుడి కుటుంబాన్ని కలవడానికి అమెరికా రాయబారి షాహీన్‌బాగ్‌ను సందర్శించడం బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే ప్రయత్నమని రష్యా పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ' పేరును ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో ప్రకటించారు.