Taiwan: చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు.. తైవాన్ సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taiwan: పొరుగుదేశాలపై చైనా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోకి చొరబడడానికి ప్రయత్నించిన చైనా సేనలు.. రెండు రోజులుగా తైవాన్‌ను భయపెట్టేలా భారీస్థాయిలో యుద్ధ విమానాలను బరిలోకి దింపాయి. ఏకంగా 71 విమానాలు తైవాన్ జలసంధి మీదుగా దూసుకుపోయాయి. వీటికి తోడు మరో ఏడు యుద్ధ నౌకలూ రంగంలోకి దిగాయి. క్షిపణి వ్యవస్థలతో ఈ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని, తమ గగనతలంలో చైనా వైమానికదళం చేసిన అతి పెద్ద చొరబాటు ఇదేనని తైవాన్ సైన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలో తైవాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం ఏడాది పాటు తప్పనిసరిగా పని చేసేలా చట్టం తీసుకురానుంది.
తైవాన్‌పై దాడి చేసి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. తైవాన్‌పై చైనా ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ఈ నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమవుతోంది. చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం ఏడాది పాటు తప్పనిసరిగా పని చేసేలా చట్టం తీసుకురానుంది. గతంలో కూడా ఆ దేశంలో ఈ చట్టం అమలులో ఉండేది. అయితే, కొంతకాలం క్రితం దీన్ని నాలుగు నెలలకు తగ్గించారు. అంటే ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం నాలుగు నెలలు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయం చాలా తక్కువని అక్కడ చాలా మంది అంటున్నారు. పైగా చైనా నుంచి దాడి ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదిపాటు సైన్యంలో పని చేసేలా చట్టాన్ని రూపొందిస్తోంది.
Also Read
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
Brain Eating Amoeba: మెదడును తినే వ్యాధి.. ఆ దేశంలో తొలి మరణం నమోదు
ఇదివరకు ఉన్న నాలుగు నెలల గడువును ఏడాదికి పెంచనుంది. 2024 నుంచి తైవాన్ ఈ నిబంధనను అమలు చేయనుంది. ఒకప్పుడు తైవాన్.. చైనాలో భాగంగా ఉండేది. 1949 చైనా సివిల్ వార్ సందర్భంగా, ఆ దేశం నుంచి విడిపోయి స్వతంత్రంగా ఉంటోంది. కానీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా తైవాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నాడు. చైనా తైవాన్‌ను తనలో కలిపేసుకోవాలి అనుకుంటుంటే.. తైవాన్ దీనికి నిరాకరిస్తోంది.
తాజావార్తలు
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!